అంతపెద్ద పాము..భయపడిపోయిన కూలీలు!
పోలవరం జిల్లా అడ్డతీగల సమీపంలో నిన్న రాత్రి భారీ కొండచిలువ కలకలం రేపింది. ఆ కొండచిలువ చెట్టుకు చుట్టుకుంటూ క్రమంగా పైకి పాకుతూ వెలుతున్న దృశ్యాన్ని స్థానికులు టార్చ్ లైట్ సహాయంతో మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. అంత పెద్ద పామును చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
విధాత : ఇంటర్నెట్ వినియోగంతో సాగిపోతున్న ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా సమాచారం ప్రజల ముందుంటుంది. ప్రకృతిలోని వింతలు, విశేషాలతో కూడిన సమాచారం అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. తాజాగా ఓ భారీ పైథాన్ చెట్టు ఎక్కుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సాధారణంగా అనకొండలు లేదా కొండ చిలువలుగా పిలువబడే పాములు భారీ పరిమాణంలో పొడవైన శరీరంతో ఉండటం చూస్తుంటాం. అందులోనూ అమెజాన్ అడవులు, నది ప్రాంతాలలో నివసించే అనకొండలు భారీ శరీర పరిమాణంతో కనిపిస్తుంటాయి. కొండచిలువలు చిన్న జంతువులను అమాంతం మింగేస్తాయి. కొన్నిసార్లు మనుషులను మింగేసిన ఘటనలు ఉన్నాయి. అలాంటి భారీ కొండ చిలువ ఒకటి ఏపీలోనూ కనిపించడం కూలీలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
పోలవరం జిల్లా అడ్డతీగల సమీపంలో నిన్న రాత్రి భారీ కొండచిలువ కలకలం రేపింది. రంపచోడవరం-అడ్డతీగల జాతీయ రహదారి పక్కనే ఉన్న టేకు తోటలో వలస కూలీలు దీనిని గుర్తించారు. ఆ కొండచిలువ చెట్టుకు చుట్టుకుంటూ క్రమంగా పైకి పాకుతూ వెలుతున్న దృశ్యాన్ని స్థానికులు టార్చ్ లైట్ సహాయంతో మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. అంత పెద్ద పామును చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. మాములుగా పాములు ముందుకు సాగుతూ చెట్లను ఎక్కుతాయి. అయితే ఈ భారీ కొండచిలువ మాత్రం చెట్టుకు చుట్టుకుంటూ.. సర్రుమంటూ పైకి ఎక్కింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోని చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతూ షేర్ చేస్తున్నారు.
AP: పోలవరం జిల్లా అడ్డతీగల సమీపంలో నిన్న రాత్రి భారీ కొండచిలువ కలకలం రేపింది. రంపచోడవరం-అడ్డతీగల జాతీయ రహదారి పక్కనే ఉన్న టేకు తోటలో వలస కూలీలు దీనిని గుర్తించారు. ఆ కొండచిలువ చెట్టుకు చుట్టుకుంటుండగా, స్థానికులు టార్చ్ లైట్ సహాయంతో మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. అంత పెద్ద… pic.twitter.com/itEJkKBWPy
— ChotaNews App (@ChotaNewsApp) April 28, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram