కేంద్రం గెజిట్‌ నోట్‌ విడుదల చేయడం శుభపరిణామం

తూ.గో జిల్లా: నీటి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు స్వాగతించారు. ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డులకు అప్పగిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయటం శుభపరిణామమం అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్యకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జీవీఎల్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా రాజమండ్రిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు […]

  • Publish Date - July 16, 2021 / 09:13 AM IST

తూ.గో జిల్లా: నీటి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు స్వాగతించారు. ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డులకు అప్పగిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయటం శుభపరిణామమం అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్యకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జీవీఎల్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా రాజమండ్రిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయడం శుభపరిణామమని జీవీఎల్‌ హర్షం వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యే దిశగా తమ వాణి వినిపిస్తామని పేర్కొన్నారు.