అమరావతి : కాకినాడ జిల్లా తునీ మండలం దొండవాక గ్రామపంచాయతీ చిక్కుళ్ల అగ్రహరం నుంచి తప్పిపోయిన రెండేళ్ల చిన్నారి సుంకరి జ్ఞానేశ్వరి కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 25 రోజులైనా చిన్నారి ఆచూకి దొరకకపోవడంతో.. రూ. 1 లక్ష పారితోషికం అంటూ తునీ రూరల్ పోలీసులు గోడ పత్రికలు అంటించారు.
జ్ఞానేశ్వరి ఫోటో, గుర్తుల వివరాలతో కూడి వాల్ పోస్టర్లను యారు చేసి.. కాకినాడ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటించారు. చిన్నారి ఆచూకి తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోస్టర్లలో వెల్లడించారు. చిన్నారి ఆచూకి తెలిసిన వారు పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సెల్ ఫోన్ నంబర్ 94407 96508, తునీ రూరల్ సీఐ 94407 96531, తునీ ఎస్సై 94407 96573 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. ఏపీ పోలీసులకు చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కనిపెట్టడం పెద్ద సవాల్ గా మారింది. ఆధునిక సాంకేతి పరిజ్ఞానం అందుబాటులో ఉన్న కాలంలోనూ చిన్నారి జాడ కనిపెట్టలేకపోతుండటం పోలీసుల పనితీరును ప్రశ్నార్థకం చేస్తుంది.
