తూర్పు కృష్ణాజిల్లాకు తలమానికం మచిలీపట్నం మెడికల్ కళాశాల

విధాత‌:తూర్పు కృష్ణాజిల్లాకు తలమానికంగా మచిలీపట్నం మెడికల్ కళాశాల నిలువనున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నాం ఆయన స్థానిక జిల్లా కలెక్టరేట్ లో ఆసరా, సంక్షేమశాఖలను పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ కె. మోహన కుమార్, రెవిన్యూ, రోడ్లు భవనాల శాఖ తదితర శాఖల అధికారులతో వివిధ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, మచిలీపట్నంలో వైస్సార్ జగనన్న […]

తూర్పు కృష్ణాజిల్లాకు తలమానికం మచిలీపట్నం మెడికల్ కళాశాల

విధాత‌:తూర్పు కృష్ణాజిల్లాకు తలమానికంగా మచిలీపట్నం మెడికల్ కళాశాల నిలువనున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నాం ఆయన స్థానిక జిల్లా కలెక్టరేట్ లో ఆసరా, సంక్షేమశాఖలను పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ కె. మోహన కుమార్, రెవిన్యూ, రోడ్లు భవనాల శాఖ తదితర శాఖల అధికారులతో వివిధ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, మచిలీపట్నంలో వైస్సార్ జగనన్న మెడికల్‌ కళాశాల వద్ద భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భారీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం నుండి కరగ్రహారంకు వెళ్లే రోడ్డులో పాత వ్యవసాయ పరిశోధన క్షేత్రం వద్ద 62 ఎకరాలలో నిర్మిస్తున్న వైద్య కళాశాల నిర్మాణ పనులను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రా సృక్టర్లు ప్రాజెక్ట్ నిర్మాణ సారథ్యంలో రూ.550 కోట్లతో ఆధునిక వసతులతో కూడిన ఈ వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా మొదలయ్యాయని అన్నారు. తూర్పు కృష్ణాజిల్లాకు తలమానికంగా అత్యవసర, సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు మరో రెండేళ్లలో ప్రజలందరికి అందుబాటులోనికి రానున్నామని ఆయన తెలిపారు.
ఈ మెడికల్ కళాశాలను 24 నెలల వ్యవధిలో సాంకేతిక ప్రమాణాలతో అత్యంత పటిష్టంగా నిర్మించనున్నట్లు తెలిపారు. వైద్య కళాశాలకు సమీపంలో డబుల్ లైన్ రైల్వే ట్రాక్, రైల్వే గేట్ ఉందని ఆ మార్గంలో వివిధ రైళ్లు తిరిగే సమయంలో అనేకమార్లు గేట్ మూయబడే అవకాశం ఉందన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని కరగ్రహారం రోడ్డులో రాడార్ కేంద్రం సమీపం నుంచి మెడికల్ కళాశాల వరకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 650 మీటర్ల నిడివిలో ప్లాను సిద్ధం చేసినట్లు ఆ నిర్మాణ నమూనాను ఇంజినీరింగ్ నిపుణులు మంత్రి పేర్ని నానికి చూపించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె. మోహన కుమార్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ , మచిలీపట్నం ఎం పి డీ ఓ జీ.వి. సూర్యనారాయణ, మచిలీపట్నం డివిజన్ ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి, తహశీల్ధార్ సునీల్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.