విధాత: ఏపీ హెచ్‌ఆర్‌సీ ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు మధ్యంతరం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలులో హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త ఏర్పాటు తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, 2017లో విజయవాడలో ఏపీహెచ్‌ఆర్‌సీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులకు సవరణ చేస్తూ విజయవాడ నుంచి కర్నూలుకు మారుస్తూ వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.