విధాత:ప్రాథమిక పాఠశాలల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న మెమో 172 రద్దు చేయాలని యుటిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.ప్రాథమిక పాఠశాలు యధావిధిగా కొనసాగించాలి,అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాలి.పాఠశాల విద్య రంగంలో జూనియర్ కాలేజీలు ప్రారంభించాలని పాఠశాలలు మూత, ఉపాధ్యాయ పోస్టులు రద్దుకు కారణం అవుతున్న 172 మెమో రద్దు చేయాలని పి.బాబురెడ్డి యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పేర్కొన్నారు.