విధాత :కేంద్ర ప్రభుత్వ నిధులతో 1968 లో తెలుగు అకాడమి నెలకొల్పబడింది.పరిశోధనలకు,ఆధునీకరణకు,భాషా వ్యాప్తికి కృషి చేయడం ఈసంస్ద లక్ష్యం.ఆనాటి విద్యామంత్రి పీ.వి.నరసింహరావు తొలి అధ్యక్షులు.ఇంటర్ నుంచి పీజీ వరకు పాఠ్యగ్రంధాలను తయారుచేయించి ప్రచురించింది.దాదాపు 300కోట్ల నిధులతో స్వయం ప్రతిపత్తి గల సంస్దగా రూపొందింది.రాష్ట్ర విభజన తరువాత మనకు రావలసిన నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విపలమైంది. లక్ష్మీపార్వతిని అధ్యక్షులుగా నామమాత్రంగా తెలుగు అకాడమిని ఏర్పర్చారు తప్ప నిధులివ్వలేదు.చేసిన పనులూ లేవు.
రాష్ట్ర ప్రభుత్వానికి సంస్కృతం మీద ప్రీతి ఉంటే ప్రత్యేక అకాడమి గా ఏర్పర్చాలి తప్ప తెలుగు అకాడమీ లో కల్పడం భావ్యం కాదు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలుగు అకాడమి చరిత్రను,లక్యాలను ఇప్పుడైన తెలుసుకోవాలి.తెలుగు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరించడం మంచిదికాదు.మన మాతృభాషను గౌరవించుకోవడం మన ప్రభుత్వాల ప్రధమ కర్తవ్యం కావలసింది పోయి,తెలుగు భాషను అంతం చేయడానికి పుట్టినట్లు వ్యవహరించడం విచారకరం.ఇప్పటికే మాతృభాషా మాధ్యమానికి మంగళం పాడారు,ఇక తెలుగు సంస్దల వంతుకి వచ్చినట్లుంది.మీకు నిజంగా తెలుగు మీద ప్రేమాభిమానాలుంటే తెలుగు అకాడమిని అలాగే ఉంచండి.నిధులివ్వండి.సంస్క్రతానికి ప్రత్యేక అకాడమిని ఏర్పర్చండి.
-మండలి బుద్ద ప్రసాద్.
మాజీ ఉపసభాపతి.