జగన్ బెయిల్ పిటిషన్ విచారణ 26కి వాయిదా

విధాత‌,హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీబీఐ లిఖితపూర్వక వాదనలు సమర్పించక పోవడాన్ని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కౌంటర్ ధాఖలు చేయడానికి 10 రోజులు గడువు కావాలని సీబీఐ కోరింది. ఇప్పటికే సీబీఐ అధికారులకు రెండు దఫాలు అవకాశమిచ్చారని, ఇప్పుడు మరో అవకాశం ఇవ్వొద్దని కోర్టుకి తెలిపారు పిటిషనర్. సీబీఐ అనేది దర్యాప్తు సంస్థ కాబట్టి చివరిగా ఒకసారి అవకాశం ఇస్తున్నామని కోర్టు […]

  • Publish Date - July 14, 2021 / 08:45 AM IST

విధాత‌,హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీబీఐ లిఖితపూర్వక వాదనలు సమర్పించక పోవడాన్ని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కౌంటర్ ధాఖలు చేయడానికి 10 రోజులు గడువు కావాలని సీబీఐ కోరింది. ఇప్పటికే సీబీఐ అధికారులకు రెండు దఫాలు అవకాశమిచ్చారని, ఇప్పుడు మరో అవకాశం ఇవ్వొద్దని కోర్టుకి తెలిపారు పిటిషనర్. సీబీఐ అనేది దర్యాప్తు సంస్థ కాబట్టి చివరిగా ఒకసారి అవకాశం ఇస్తున్నామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను 26కి వాయిదా వేసింది.