నిర్వాసితుల సమస్యను జగన్ సీరియస్‌గా తీసుకోవడం లేదు: ఉండవల్లి

తూ.గో. విధాత‌: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పోలవరం నిర్వాసితుల సమస్యను సీఎం సీరియస్‌గా తీసుకోవడం లేదని విమర్శించారు. రూ.10 లక్షల పరిహారం ఇస్తామన్న హామీ ఇంతవరకు అమలు కాలేదన్నారు. 151 మంది ఎమ్మెల్యేల బలం ఉండి కూడా జగన్ విభజన సమస్యలు పరిష్కరించలేకపోయారని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల్లో 50 శాతం వాటా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్లు నిల్వ చేయకుండా […]

  • Publish Date - July 8, 2021 / 03:54 AM IST

తూ.గో. విధాత‌: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పోలవరం నిర్వాసితుల సమస్యను సీఎం సీరియస్‌గా తీసుకోవడం లేదని విమర్శించారు. రూ.10 లక్షల పరిహారం ఇస్తామన్న హామీ ఇంతవరకు అమలు కాలేదన్నారు. 151 మంది ఎమ్మెల్యేల బలం ఉండి కూడా జగన్ విభజన సమస్యలు పరిష్కరించలేకపోయారని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల్లో 50 శాతం వాటా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్లు నిల్వ చేయకుండా పోలవరం ప్రాజెక్టు ఎంత ఎత్తులో నిర్మించినా ఉపయోగం లేదని ఉండవల్లి అభిప్రాయం వ్యక్త చేశారు. ఆస్తులు అమ్మి, అప్పులు చేసి నవరత్నాలు అమలు చేస్తున్నట్లుగానే.. పోలవరం ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సీఎంకు, ఎంపీకి గొడవ వచ్చినప్పుడు.. ముఖ్యమంత్రే స్పందించి సమస్య పరిష్కరించుకోవాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు.