ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై … కేశినేని నాని సంచలన నిర్ణయం

ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లుగా మాజీ ఎంపీ, విజయవాడ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ట్విటర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై … కేశినేని నాని సంచలన నిర్ణయం

విధాత, హైదరాబాద్ : ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లుగా మాజీ ఎంపీ, విజయవాడ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ట్విటర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇటీవల ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కేశినేని నాని(శ్రీనివాస్‌) విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి తమ్ముడు టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని(శివనాథ్‌) చేతిలో 2.82లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014, 2019ఎన్నికల్లో ఇదే స్థానంలో కేశినేని నాని గెలుపొందారు. తాజా ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలిచిన వారు ఈ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఇక మీదట తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని, రెండుసార్లు నన్ను ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు కృతజ్ఞతలని ట్వీట్ చేశారు.