విశాఖ ఉక్కు ఉద్యమానికి మంద కృష్ణ మాదిగ మద్దతు

విధాత‌: విశాఖ ఉక్కు ఉద్యమానికి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం బాధాకరమన్నారు. ప్రజలు, కార్మికులు, నిర్వాసితుల మనోభావాలు గౌరవించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాకు కేంద్రం కట్టుబడి ఉండాలన్నారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలన్నీ అమలు చేయాలని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఈ నెల 24న ఢిల్లీ లో జాతీయ మహా సభ […]

విశాఖ ఉక్కు ఉద్యమానికి మంద కృష్ణ మాదిగ మద్దతు

విధాత‌: విశాఖ ఉక్కు ఉద్యమానికి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం బాధాకరమన్నారు. ప్రజలు, కార్మికులు, నిర్వాసితుల మనోభావాలు గౌరవించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాకు కేంద్రం కట్టుబడి ఉండాలన్నారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలన్నీ అమలు చేయాలని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఈ నెల 24న ఢిల్లీ లో జాతీయ మహా సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తమకు మద్దతు ఇచ్చిన వారందరినీ సభకు ఆహ్వానిస్తున్నామని మందకృష్ణ మాదిగ అన్నారు.