విధాత,అమరావతి:నేడు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్లను లెక్కింపు కోసం సీఆర్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగు ప్రత్యేక హాళ్లు ఏర్పాటు చేశారు.లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ… ఆదేశించారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు.మార్చి 10న పోలింగ్ జరిగినా హైకోర్టు ఆదేశాలతో లెక్కింపు ప్రక్రియను నిలిపివేశారు.