విధాత: జగన్ రెడ్డి గారి చేతగానితనాన్ని అలుసుగా తీసుకొని మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఈ నెల 25 న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 13 ఏళ్ల బాలిక పై మానవ మృగం అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. కన్న బిడ్డల్ని కోల్పోయి బాధిత కుటుంబాలు బాధపడుతుంటే, నిందితులు హాయిగా బెయిల్ పై బయటకొచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక 9 రోజులే మిగిలాయి రమ్య హంతకుడికి ఉరిశిక్ష వేసి ఆడబిడ్డలకు భరోసా ఇవ్వండని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.