విధాత:ఎన్నికలకి ముందు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాటిచ్చి, అధికారంలోకొచ్చాక మాట తప్పిన ముఖ్యమంత్రి తీరుకి నిరసనగా నిరుద్యోగులు శాంతియుత ఆందోళన చేయడం ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని మండిపడ్డారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ . విజయనగరం జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి జాబు క్యాలెండర్ విడుదల కోసం ఉద్యమిస్తున్నాడనే కక్షతో శాంతిభద్రతలకి విఘాతం కలిగిస్తున్నాడని తప్పుడు ఆరోపణలతో 107 సెక్షన్ కింద బైండోవర్ చేయడం రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కుల్ని గొంతు నులిమేయడమే. ఇకపై ఉద్యోగాల కోసం, విద్యార్థుల హక్కుల కోసమో నిరసన తెలిపే వీల్లేకుండా 50 వేల రూపాయల డిపాజిట్ చేయాలని అప్రజాస్వామిక ఆదేశాలిచ్చిన తహశీల్దార్ తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉపాధిలేక ఉసూరుమంటోన్న నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు జగన్ రెడ్డి గారూ!ఉద్యోగాలివ్వరు..ఉద్యమించినోళ్ల గొంతులు ఎన్నాళ్లు ఇలా నొక్కేస్తారు? అంటూ ద్వజమెత్తారు.