విధాత:మారేడుమిల్లి నుంచి రంపచోడవరం చేరుకుని ప్రధాన కూడలిలో ప్రజల్ని ఉద్దేశించి ఉదయం 11 గంటల నుంచి 11.30 నిమిషాల వరకూ మాట్లాడతారు.మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంట వరకూ దేవీపట్నం మండలం, పెదవేంపల్లి గ్రామ నిర్వాసితులతో ముఖాముఖి మాట్లాడతారు. మధ్యాహ్నం 1.45 నుంచి 2.15 వరకూ దేవీపట్నం మండలం ఇందుకూరు గ్రామ నిర్వాసితులతో సమస్యలపై చర్చిస్తారు.మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల వరకూ దేవీపట్నం మండలం ముసిరిగుంట గ్రామంలో పోలవరం నిర్వాసితుల్ని కష్టాలు అడిగి తెలుసుకుంటారు.మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ గోకవరం మండలం క్రిష్ణునిపాలెంలో నిర్వాసితులతో భేటీ అవ్వనున్నారు.