విధాత: దిశ చట్టంతో ముగ్గురికి ఉరి శిక్ష, 20 మందికి కఠిన జైలు శిక్ష పడింది అంటూ ఆడబిడ్డల్ని మోసం చేసారు మహిళా హోంమంత్రి. దిశ చట్టంతో ఉరి శిక్ష పడ్డ వారి పేర్లు బయట పెట్టే దమ్ముందా జగన్ రెడ్డి గారు? ఇంకా 3 రోజులే మిగిలాయి దళిత బిడ్డ రమ్యని దారుణంగా నడి రోడ్డుపై నరికి చంపిన వాడికి ఉరి వేసేది ఎప్పుడు? దిశ చట్టానికి ప్రచారం అంటూ సొంత మీడియాకి యాడ్స్ ఇచ్చుకొని కొట్టేసిన 30 కోట్లు పోలీసు వ్యవస్థ బలోపేతం కోసం వినియోగించి ఉంటే పరిస్థితి కొంతయినా మెరుగుపడేది సీఎం గారు అని ఎద్దేవ చేశారు నారా లోకేష్.