జగన్ పాలనలో మహిళలకు భద్రత శూన్యం

విధాత‌:రాష్ట్రంలో మహిళల పట్ల వివక్ష, మహిళలపై హింస, దాడులు, అత్యాచారాలు పెరగడం పట్ల మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతీ శ్రీనివాసన్ ఆందోళన వ్యక్తంచేశారు. మహిళా కమిషన్ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు. తక్షణం మహిళలకు అన్నివిధాల భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళామోర్చా రాష్ట్ర కార్యవర్గసమావేశం గురువారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వనతీ శ్రీనివాసన్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రజా వ్యతిరేకవిధానాలపై ప్రసంగించారు. మహిళల […]

  • Publish Date - July 15, 2021 / 05:03 PM IST

విధాత‌:రాష్ట్రంలో మహిళల పట్ల వివక్ష, మహిళలపై హింస, దాడులు, అత్యాచారాలు పెరగడం పట్ల మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతీ శ్రీనివాసన్ ఆందోళన వ్యక్తంచేశారు. మహిళా కమిషన్ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు. తక్షణం మహిళలకు అన్నివిధాల భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళామోర్చా రాష్ట్ర కార్యవర్గసమావేశం గురువారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వనతీ శ్రీనివాసన్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రజా వ్యతిరేకవిధానాలపై ప్రసంగించారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకటనలకే సరిపోయిందని విమర్శించారు. ఈ ప్రభుత్వ హయాంలో మహిళలపై వివక్ష పెరిగిందని, అత్యాచారాలు, దాడులు, పెరిగిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మహిళల భద్రత రోజురోజుకు దిగజారిపోతూ గాలిలో దీపంలా మారిందన్నారు. మహిళా కమిషన్ ఏమాత్రం స్పందించడం లేదని మహిళా మోర్చా, కమిషన్ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేస్తోందన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం అమలుచేస్తామన్న ముఖ్యమంత్రి దానిని నెరవేర్చలేదని అదే ఈ అనర్ధాలకు మూలమని అన్నారు. మద్యం నిషేధం అమలుచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు అదనపు పన్నులు వేయడం వల్లే పెట్రోల్ ధరలు పెరిగాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బూత్ స్థాయి బలోపేతం లక్ష్యంగా పేర్కొన్నారు. జన్ ధన్ నుంచి స్వచ్ఛభారత్ వరకు, స్టాండప్ నుంచి ఉజ్వల పథకం వరకు ప్రధానమంత్రి సంక్షేమ పథకాలు మహిళల్లోకి తీసుకెళ్లాలని, కోవిద్ సమయంలో ఆయుష్మాన్ భారత్ పథకం ఎంతో మేలు చేసింది. కుటుంబం మొత్తానికి రూ.5 లక్షల విలువైన వైద్యసదుపాయాన్ని అందించిందని తెలిపారు. ప్రధాని మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని మహిళలు చైతన్యంతో మోడీ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.

మహిళామోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జి సుప్రీత్ కౌర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళా మోర్చా ఉత్సాహభరిత వాతావరణం పోరాటస్ఫూర్తితో పనిచేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమించినందున దక్షిణ భారత సంస్కృతి తెలుసుకునే అవకాశం లభించిందన్నారు. కరోనా సమయంలో మహిళా మోర్చా చేసిన సేవను ప్రశంసించారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండాలని, భాగస్వామ్యం పెరగాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, పార్టీ సంస్థాగతంలో 33 శాతం రిజర్వేషన్లు అమలుచేసిందని, కేబినెట్లో 11 మంది మహిళలకు మంత్రిపదువులు ఇచ్చిందని గుర్తుచేశారు.దక్షిణాదిలో నటులను దేవుళ్లుగా ఆరాధిస్తారని, సూపర్ ఓడించిన ఘనత వనతీ శ్రీనివాసన్ గా పేర్కొన్నారు. స్టార్లుగా కొలుస్తారని, అలాంటి వ్యక్తి కమలాసన్ను

భాజపా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జి సునిల్ డియోధర్ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంతవరకు మహిళల సమస్యలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గ్రామాల్లో మరుగుదొడ్లు, పాఠశాలల్లో బాలికలకు మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే అన్నారు. కరెంటు సదుపాయం లేని 17 వేల గ్రామాలకు కనెక్షన్లు ఇచ్చి ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్అండర్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇలా మహిళల కోసం పలురకాల పథకాలు అమలుచేసినట్లు వివరించారు. మహిళలు తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని తెదేపా, వైకాపా రెండు కుటుంబ, కుల, అవినీతి పార్టీలని, భాజపా వీటిని భిన్నమైనదని అన్నారు. ప్రతి మహిళ ప్రధాని సుపరిపాలన, సంక్షేమ పథకాలు తోటి మహిళలకు వివరించి వారిలో రాజకీయ చైతన్యం తెచ్చేలా పనిచేయాలని, ప్రజావ్యతిరేకవిధానాలపై పోరాటం చేయాలని సూచించారు. ప్రజాపోరాటాల ద్వారానే ప్రజలకు దగ్గరవుతామని, అధికారం లభిస్తుందని చెప్పారు.

భాజపా పూర్వ అధ్యక్షులు, కన్నా లక్ష్మీనారాయణ ప్రజల సంక్షేమమే పరమావధిగా ప్రధాని నరేంద్రమోదీ రైతులు, మహిళలు, యువత, అన్నివర్గాల వారికి 108కి పైగా పథకాలు అమలుచేసి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారన్నారు. దేశంలో మౌలికసదుపాయాలు పెంచడం ద్వారా అభివృద్ధిని వేగవంతం చేశారని ప్రశసించారు. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపి భద్రత అందించారన్నారు. మహిళా సాధికారతతోనే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందనే యోచనతో మహిళలకు జననీ సురక్ష, బేటీ బచావ్ – బేటీ పడావో, స్టాండప్ ఇండియా, ఉజ్వల్, ముద్ర వంటి పథకాలు అమలుచేస్తున్నారని అన్నారు. త్రిపుల్ తలాక్ను నిషేదించి ముస్లిం మహిళలను వందల ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యను తొలగించారన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో జగన్ కుటుంబానికి తప్ప మరో కుటుంబానికి బద్రత లేదని విమర్శించారు. రెండేళ్లుగా ఓట్లు కొనుగోలు తప్ప ప్రజల బద్రత గురించి పట్టించుకోవడం లేదని, నియంతలా పాలిస్తున్నారని ఆరోపించారు. మహిళల సమస్యలు పరిష్కరించడంలో మహిళా మోర్చా సమర్ధంతంగా పనిచేసి పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయాలని సూచించారు.

మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళ హెూంమంత్రి ఉన్నా మహిళలకు భద్రత లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. నిందితులను పట్టుకోవడం లేదని, మహిళా కమిషన్ అలంకారప్రాయంగా మారిందని ఆరోపించారు. సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే దిశచట్టం వంటి వాటి గురించి ప్రభుత్వం మాట్లాడుతుందని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న మహిళా వ్యతిరేక విధానాలపై మైనార్టీ మోర్చా నిరసన వ్యక్తంచేస్తుందని, రాబోయే రోజుల్లో ప్రత్యక్ష పోరాటాలకు కార్యాచరణ సిద్ధం చేస్తుదని తెలిపారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల పదాధికారులు పాల్గొన్నారు.