విధాత:అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇంతకాలం ఉత్తరాంధ్రను భక్షించినవాళ్ళే.. ఈరోజు రక్షిస్తామంటూ చర్చా వేదికలు, బస్సు యాత్రలు చేస్తామంటుంటే- ఉత్తరాంధ్ర ప్రజలు ఒకవైపు ఆశ్చర్యానికి, మరోవైపు ఈ ప్రాంత టీడీపీ నేతల మాట్లాడుతున్న మాటలను చూసి అసహ్యించుకుంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే,రాష్ట్ర అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అమర్ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నన్నాళ్ళు విశాఖపట్నాన్ని చంద్రబాబు ఒక గెస్ట్ హౌస్ ప్రాంతంగానే చూశారు తప్పితే.. ఏనాడూ వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కనీసం ప్రయత్నించలేదన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తే.. చంద్రబాబు, టీడీపీ నేతలు ఎందుకు అమరావతి జపం చేస్తున్నారని ప్రశ్నించారు.అమరావతి మీద కూడా చంద్రబాబుకు ఉన్నది కమర్షియల్ అటాచ్ మెంటేగానీ,ఎమోషన్ అటాచ్ మెంటు కాదని చెప్పారు.
గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
1- విశాఖ వేదికగా టీడీపీ ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు … ఉత్తరాంధ్ర రక్షణ వేదిక పేరిట ఒక సమావేశం నిర్వహించడం.. చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్లు మాట్లాడిన విధానం, మాట్లాడిన అంశాలు చూస్తే ఈ ప్రాంత ప్రజలకు ఓ పక్క ఆశ్చర్యం, మరోవైపు అసహ్యాన్ని కలిగించాయి. టీడీపీలో ఉద్ధండులుగా చెప్పుకునేవాళ్లు దద్దమ్మల్లా మాట్లాడటం సిగ్గుచేటు. ఈ ప్రాంతానికి ఏరోజూ మేలు చేయనివాళ్లు, ఇంతకాలం ఉత్తరాంధ్రను భక్షించినవాళ్లే .. రక్షించాలని మాట్లాడిన తీరు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది.
2- 2019 సాధారణ ఎన్నికలు మొదలు.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల వరకూ ఉత్తరాంధ్ర ప్రజలు … టీడీపీ బట్టలు విప్పి నడిరోడ్డుపై నగ్నంగా నిలబెట్టిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి సిగ్గు రావడం లేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసిందేమీ లేకపోయినా.. ఆ పార్టీ నాయకులకు మాత్రం చంద్రబాబు మత్తు దిగటం లేదు. అన్ని ఎన్నికల్లో ఆ పార్టీని నగ్నంగా రోడ్డుపై నిలబెట్టినా, ఇంకా బుద్ధి రాలేదా అన్నది వారే తేల్చుకోవాలి. ఇంకా చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్‌కు చెంచాల్లా మిగలాలనుకుంటే అది వారి ఖర్మ.
3- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి ఉత్తరాంధ్రలోని విశాఖ నుంచి ఇచ్ఛాపురం వరకూ అభివృద్ధికి బీజం వేస్తే దాన్ని ఏరకంగా టీడీపీ అడ్డుకుంటుందో అందరికి తెలిసిందే. ఉత్తరాంధ్ర ప్రాంతానికి జగన్ దేశ చిత్రపటంలో ఒక గుర్తింపును తీసుకు వచ్చారు. ఈ ప్రాంతానికి మేలు చేయాలని చూస్తుంటే మరి ఏ హక్కుతో టీడీపీ ఇవాళ ఉత్తరాంధ్ర పరిక్షణ వేదిక పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసింది.
4- విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడు,ఆయన సోకాల్డ్ మీడియా, ఆ పార్టీ నాయకులతో ఏవిధంగా విష ప్రచారం చేయించారో చెప్పాలి. ఆవర్గం మీడియా చంద్రబాబు తాలుక ఆలోచనలు,తమ సొంత రాజధాని అయిన అమరావతిలో జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కాపాడాలనుకునే విధంగా రాతలు రాయించడం దారుణం. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు… తన పార్టీ సభ్యులతో విశాఖలో తుపాన్‌లు వస్తాయి, ఈ ప్రాంతంలో రైల్వేజోన్ ఏర్పాటు చేస్తే ఇబ్బందులు వస్తాయని తన పార్లమెంట్ సభ్యులుతో లేఖలు రాయించడం మర్చిపోయారా? అప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు ఎందుకు స్పందించలేదు?
5- మరి మీరు ఉత్తరాంధ్ర పాంత్ర నేతలా? లేక చంద్రబాబుకు బంట్రోతులా?. వాస్తవానికి ఆయనకు ఉన్న బంట్రోతులు కూడా తమ పుట్టిన ప్రాంతానికి మేలు చేయాలనే తపనతో ఉంటారు. 14 ఏళ్లు అధికారంలో ఉండి, మంత్రులు గా పనిచేసిన వ్యక్తులు ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడుతుంటే సిగ్గులేదా అని ప్రజలు అడుగుతున్నారు. నిన్న ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు పెట్టిన సమావేశం … చంద్రబాబు ఆశయాలు, వ్యాపారాలు, విధానాలు కాపాడటానికి ఏర్పాటు చేసిన భజన మండలి పిక్నిక్ మీట్ గా కనిపించింది. ఆ సమావేశంలో పోలవరం, సుజల స్రవంతి గురించి మాట్లాడుతుంటే మీరు ఎప్పుడైనా ఆ పదాలు విన్నారా అని అడుగుతున్నాం.
వైయస్సార్ అధికారంలో ఉన్నప్పుడు పోలవరానికి పునాది రాయి వేశారు. సుజల స్రవంతికి శంకుస్థాపన చేశారు. దురదృష్టవశాంత్తూ వైయస్సార్ చనిపోతే ఆపనులు ఆగిపోయాయి. ఇప్పుడు ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్ పనులు కొనసాగించేందుకు తాండవలిఫ్ట్‌తో కలిపి సుమారు రూ. 8,400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో ఒక్కపనైనా చేశారా?గతంలో మీ తొమ్మిదేళ్ల పాలనలో సుజల స్రవంతి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎవరో పుట్టిన బిడ్డకు మీరు పేరు పెడతానంటే ఎలా చంద్రబాబు ..?
6- విశాఖ అంటే చంద్రబాబు దృష్టిలో ఒక గెస్ట్‌హౌస్. కాక్‌టెయిల్ పార్టీలు ఇచ్చుకోవాలంటే, విశాఖ అందాలు, సదుపాయాలు, పార్కులు, హోటెల్స్ కావాలి. కానీ అభివృద్ధి కోసం ఏమాత్రం ఏనాడూ కృషి చేయలేదు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు… ఇవాళ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం మనం చూస్తున్నాం. అలాగే ఉత్తరాంధ్రకు అన్నివిధాల నష్టం కలిగించేలా చేసిన వ్యక్తి మళ్లీ ఇప్పుడు… ఉత్తరాంధ్ర వేదికలు, యాత్రలు అంటూ సమావేశం పెట్టడాన్ని ప్రజలు ఎలా హర్షిస్తారు?
7- అమరావతిలో ఉన్నదేంటి? విశాఖలో లేనిదేంటో టీడీపీ నేతలు సూటిగా చెప్పాలి? విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే.. అక్కడ ఉన్న రైతులతో ఇప్పటికీ ధర్నాలు చేయడం ఏంటి? అమరావతితో చంద్రబాబుకు ఉన్నది ఎమోషనల్ ఎటాచ్‌మెంట్ కాదు… కమర్షియల్ ఎటాచ్‌మెంట్ మాత్రమే. అమరావతిలో ఎందుకు రాజధాని పెట్టారో, విశాఖను ఎందుకు రాజధానిగా ప్రకటించలేదో చంద్రబాబుతో పాటు ఆయన బంట్రోతులు సమాధానం చెప్పిఉంటే ఈ ప్రాంత ప్రజలు స్వాగతించేవారు.
8- పార్టీ లేదు బొక్కాలేదు అన్న పెద్దమనిషి అచ్చెన్నాయుడు… నిన్న జరిగిన సమావేశంలో టీడీపీ అభివృద్ధి చేయడం వల్లే ప్రజలు తమను ఓడించారని చెప్పడం సిగ్గుచేటు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడాల్సి వస్తే.. వైయస్సార్ తర్వాత ఏం చేశారు చంద్రబాబూ? కనీసం ఉద్దానం గురించి ఆలోచించారా? కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారికి చికిత్స అందించేందుకు ఒక్క ఆస్పత్రి అయినా కట్టించారా? జిల్లాల వారీగా అభివృద్ధి అంటూ.. చంద్రబాబు చెప్పిన మాటలు, ఆయన గెజిట్ పేపర్ ఈనాడులో రాసిన రాతలు,అబద్ధాలు అన్నీ కేవలం ఉత్తరాంద్ర ప్రజలను మోసం చేయడం కోసమే.
9- విశాఖలో లక్ష ఎకరాలు స్వాహా చేసి, భూముల తాలుకా రికార్డులు మాయం చేసి, హుద్‌హుద్ తుపాన్ సమయంలో తడిసి ముద్దైపోయాయని, హుద్ హుద్ లో మాయం అయ్యాయని చెప్పింది ఎవరు? గొప్పలు చెప్పుకునే చంద్రబాబు వారం పాటు విశాఖ కలెక్టరేట్‌లో బస చేసి… ఆ రికార్డులు పట్టుకుపోయారా? వీరంతా విశాఖను భక్షించేసి… ఇప్పుడు రక్షిస్తామని చెబుతారా? నిన్నసరదాగా పిక్నిక్ మీటింగ్ పెట్టుకున్నారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. అలాంటి మీరు మా ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేయం హాస్యాస్పదం.
బస్సు యాత్ర ఎందుకు?
10- ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు అన్యాయం చేసినందుకు మీరు చేయాల్సింది బస్సుయాత్ర కాదు.. ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేసినందుకు క్షమాపణ యాత్రలు చేయండి. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేశాయంటూ కొన్నివందలు కోట్లు ఖర్చుపెట్టి ఎంవోయూలు అని హడావుడి చేసి ఏం సాధించారు? వైయస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయికి తీసుకు వచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది.
11- ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతోపాటు ఇంకా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే.. మచ్చుకు కొన్ని చెబుతున్నాం…
మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..
12 -విశాఖ రైల్వేజోన్‌పై మా పార్టీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.
-పాడేరులో మెడికల్ కాలేజీకి సంబంధించి ఫౌండేషన్ పూర్తయింది.
-రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ చేతులు కలపడం వల్లే.. దానికి బలైపోయింది కూడా కాంగ్రెస్ పార్టీనే.
-అధికారంలో వచ్చిన ఆర్నెల్లలోనే కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే పరిస్థితికి వచ్చాం.
-రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలను ఆహ్వానించాం. పరిశ్రమల స్థాపనకు మేం చిత్తశుద్ధితో ఉన్నాం.
-ప్రభుత్వం చేయాల్సిన అన్ని కార‍్యక్రమాలు చేస్తున్నాం. చంద్రబాబులా మార్కెటింగ్, పబ్లిసిటీ మాకు చేతకాదు
-ప్రజలకు మాత్రమే జవాబుదారీతనంగా ఉంటామే కానీ ప్రచారానికి కాదు.
-విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని త్వరలో ప్రారంభం అవుతుంది
-ఇప్పటికీ, ఎప్పటికీ రాబోయే తరాలకు విశాఖపట్నమే పరిపాలనా రాజధానిగా ఉండబోతుంది.
-చంద్రబాబు వేసిన పునాది రాళ్లు… సమాధిరాళ్లుగానే మిగిలిపోయాయి. చంద్రబాబు చేసింది కేవలం కాగితాల మీద లెక్కలకు మాత్రమే..
-ఏ రోజు అయినా, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పమనండి, ఎక్కడికైనా చర్చకు రావడానికి మేం సిద్ధం.