Pawan Kalyan| కూతురు కనిపించడం లేదంటూ డిప్యూటీ సీఎంకి తన ఆవేదన చెప్పుకున్న తల్లి.. పవన్ ఏం చేశాడంటే..!
Pawan Kalyan| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది ఒకప్పుడు, కాని ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించడంతో పాటు అతని పార్టీ తరఫున రాష్ట్రంలో పోటీ చేసిన అభ్యర్థులందరని గెలిపించుకున్నాడు. ఇక పవన్ గెలుపుని చాలా మంది సంతోషంగా స్వీకరించారు. ఇక పవన్ బాధ్యతలు అందుకున్నప్పటి నుండి తనకి కేటాయించిన శాఖలకు సంబంధించిన

Pawan Kalyan| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది ఒకప్పుడు, కాని ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించడంతో పాటు అతని పార్టీ తరఫున రాష్ట్రంలో పోటీ చేసిన అభ్యర్థులందరని గెలిపించుకున్నాడు. ఇక పవన్ గెలుపుని చాలా మంది సంతోషంగా స్వీకరించారు. ఇక పవన్ బాధ్యతలు అందుకున్నప్పటి నుండి తనకి కేటాయించిన శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల అసెంబ్లీలో కనిపించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ప్రజల్లోకి వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తూ… సత్వరమే వారి సమస్యలు పరిష్కరం అయ్యేలా చూస్తున్నారు.
జనవాణి కేంద్రంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలను చూసిన డిప్యూటీ సీఎం.. కాన్వాయి ఆపి వారితో రోడ్డుపైనే ముచ్చటించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రోడ్డుపైనే ఓ కుర్చీ వేసుకొని పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. రీసెంట్‌గా భీమవరానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె కనిపించడం లేదంటూ పవన్ కళ్యాణ్ ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తెను.. ప్రేమ పేరుతో ఎవరో ట్రాప్ చేశారని, మైనర్ అయిన తన కూతురు గత తొమ్మిది నెలలుగా కనిపించడం లేదని ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పుకొచ్చింది. కూతురు కనిపించడం లేదనే విషయమై మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని.. పోలీసులకు తమ కూతురు జాడ తెలిసినా కూడా పట్టించుకోవడం లేదంటూ పవన్ కళ్యాణ్ వద్ద మొరపెట్టుకుంది.
మహిళ బాధని పూర్తిగా విన్న పవన్ కళ్యాణ్.. తప్పకుండా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మిస్సింగ్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించి ఆ తర్వాత మాచవరం సీఐకి ఫోన్ చేసి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిస్సింగ్ కేసు మీద వెంటనే చర్చలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక జనవాణి కార్యక్రమంలో బాధలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజల సమస్యలని పవన్ సావధానంగా వింటూ వారందరికి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక పవన్ స్పీడ్ చూసిన జనసేన అభిమానులు, పవన్ ఫ్యాన్స్ మాత్రం మినిస్టర్ సాబ్ యాక్షన్ షురూ చేశారంటూ నెట్టింట తెగ కామెంట్స్ చేస్తున్నారు.