ఢిల్లీ: బీజేపీ అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తులపై చర్చించడానికి బీజేపీ అధిష్ఠానం పవన్ కళ్యాణ్‌ను ఢిల్లీకి రావాలని కబురు పెట్టారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు నాడ్డాలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు.
ఈ భేటీకి తెలంగాణ నేతలు కిషన్‌రెడ్డి, కె. లక్ష్మణ్ హాజరవుతారు. ఈ సమావేశంలో పొత్తులో భాగంగా సీట్ల పంపకాలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఆంధ్రాలో పొత్తుల అంశంపై కూడా పవన్ కళ్యాణ్ అమిత్‌షాతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.