White Cobra surgery| శ్వేత నాగు పడగకు సర్జరీ..!

గాయపడిన మనుషులకు మాదిరిగానే జంతువులకు సర్జరీ చికిత్సలు చేయడం సాధారణంగా చూస్తుంటాం. అయితే అరుదుగా పాములకు కూడా శస్త్ర చికిత్సలు చేసే సంఘటనలు దేశంలో అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అరుదైన ఓ ఆరు అడుగుల శ్వేతనాగు పడగకు శస్త్ర చికిత్స చేసి కుట్లు వేసిన ఘటన వైరల్ గా మారింది.

White Cobra surgery| శ్వేత నాగు పడగకు సర్జరీ..!

విధాత : గాయపడిన మనుషులకు మాదిరిగానే జంతువులకు సర్జరీ చికిత్సలు చేయడం సాధారణంగా చూస్తుంటాం. అయితే అరుదుగా పాములకు కూడా శస్త్ర చికిత్సలు చేసే సంఘటనలు దేశంలో అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అరుదైన ఓ ఆరు అడుగుల శ్వేతనాగు(White Cobra)  పడగకు శస్త్ర చికిత్స(Surgery) చేసి కుట్లు వేసిన ఘటన వైరల్ గా మారింది. విశాఖ పట్నం మల్కాపురంలో ఉన్న నేవీ క్యాంటీన్ లో శుక్రవారం శ్వేతనాగు కనిపించడంతో ఉద్యోగస్తులు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ నాగరాజు వచ్చి ఆ పామును బంధించి చూడగా..దాని పడగ భాగంలో గాయం ఉండటం గమనించాడు.

వెంటనే ఆ శ్వేత నాగును హిందుస్థాన్ షిప్ యార్డు కాలనీలోని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పశువైద్యాధికారి సీహెచ్. సునీల్ కుమార్.. విష నాగు ఎలా పోతే ఏంటనుకోకుండా ..బాధ్యతగా దానికి మత్తు మందు ఇచ్చి శస్త్ర చికిత్స చేశాడు. గాయమైన భాగంలో ఏడు కుట్లు వేశాడు. ప్రస్తుతం శ్వేతనాగు కోలుకుంటుందని..గాయం నయమయ్యాక దానిని అడవిలో విడిచిపెడుతామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వీడియోలో శ్వేతనాగు సర్జరీ పిదప చక్కగా పడగ విప్పి ఆడుతుండటం ఆసక్తిగా తిలకిస్తున్నారు.