తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
విధాత,తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. గురువారం 3,227 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 23 లక్షలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 988 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా.. రెండో రోజు పద్మావతి పరిణయోత్సవాలు తిరుమలలో జరుగుతున్నాయి. అశ్వవాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు.

విధాత,తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. గురువారం 3,227 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 23 లక్షలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
988 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా.. రెండో రోజు పద్మావతి పరిణయోత్సవాలు తిరుమలలో జరుగుతున్నాయి. అశ్వవాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు.