Maoist Sujathakka Surrenders : మావోయిస్టు అగ్రనేత సుజాతక్క లొంగుబాటు
మావోయిస్టు అగ్రనేత, కిషన్ జీ భార్య సుజాతక్క 43ఏళ్ల అజ్ఞాత జీవితం ముగించి ప్రభుత్వానికి లొంగిపోయారు.

విధాత, హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత..పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యురాలు, పశ్చిమ బెంగాల్ పార్టీ సెక్రటరీ పోతుల కల్పన(Pothula Kalpana) అలియాస్ సుజాతక్క(Sujathakka)(62) ప్రభుత్వానికి లొంగిపోయారు. దివంగత మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ భార్య సుజాతక్క 43 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. మోస్టు వాంటెడ్ మావోయిస్టుగా నాయకురాలిగా(Maoist Leader) ఉన్న సుజాతక్కపై 106 కేసులు, రూ.1కోటి రివార్డు సుజాతక్క 1984లో కిషన్ జీని వివాహం చేసుకుంది. ఆమెపైచత్తీస్ గఢ్ లో 72, మహారాష్ట్రలో 26కేసులు ఉన్నాయి. ఆమె స్వస్థలం గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికల్ పహడ్ గ్రామం.
ప్రస్తుతం సుజాతక్క మావోయిస్టు కేంద్ర కమిటీలో ఏకైక మహిళనాయకురాలిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లో 2011లో జరిగిన ఎన్ కౌంటర్ లో పార్టీ అగ్రనేత అలియాస్ కిషన్ జీ మరణించారు. అనారోగ్య కారణాలతో ఆమె లొంగిపోయారని డీజీపీ జితేందర్ తెలిపారు. మావోయిస్టు పార్టీలోని మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ పిలుపునిచ్చారు.