విధాత:కరోనా ప్రభావంతో నిలిచిపోయిన సదరం క్యాంపులు నేటి నుండి తిరిగి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు సదరం క్యాంపులు.ఉదయం 8 గంటలకే ప్రారంభమైన సదరం క్యాంపులు. ఈనెల 16 నుండి మీసేవ కేంద్రాల్లో కొనసాగుతున్న స్లాట్ల బుకింగ్.దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాల జారీకి తగిన ఏర్పాట్లు చేసిన వైద్య ఆరోగ్య శాఖ 171 ప్రభుత్వ ఆసుపత్రులలో సదరం క్యాంపులు నిర్వహిస్తుంది.సామాజిక ఆరోగ్య కేంద్రాలు , ఏరియా , జిల్లా, టీచింగ్ ఆసుపత్రులలో క్యాంపులు. ఆయా ప్రభుత్వ ఆస్పత్రులకు ఇప్పటికే ఉత్తర్వులు జారిచేసిన ఎపివివిపి కమిషనర్ సదరం క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.