విధాత:ఏ చిన్న విషయం వచ్చినా రాజీనామాలకు మేము రెడీ మీరు రేడీనా అంటూ ఈ మధ్య చంద్రబాబు తరచూ అడుగుతున్నారు ఆయన్ని గాని, ఆయన వెనకున్న వారిని కానీ, ఎంపీలను కానీ రాజీనామా చేయవద్దు అని ఎవరన్నా అపారా..?.వాళ్ళు రాజీనామా చేయాలనుకుంటే చేయొచ్చు…మేము గతంలో చేసి చూపించాం,మొదట్లో మా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని షరతు కూడా పెట్టుకున్నామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.2018లో మా ఎంపీలు రాజీనామాలు చేసి వాటిని ఆమోదింపజేసుకున్నారు నిరాహార దీక్షలు చేశారు…అది నిబద్ధత అంటే,ఆ పని ఆయన్ని ఎవరన్న చేయొద్దు అని అపారా..?పాలమూరు రంగారెడ్డి కడుతున్నపుడు ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి దీక్ష చేశారు.ఆ రోజు జగన్ నువ్వూ రా దీక్షకు కూర్చుందాం అని చంద్రబాబుని పిలవలేదు,ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు తన పార్టీ తరపున ఏమేమి చేయొచ్చో అన్నీ చేసే అవకాశం ఉంది.
కండిషన్లు పెట్టాల్సిన అవసరం లేదు…ఆయన రాజీనామాలు చేయాలనుకుంటే నిరభ్యంతరంగా చేయొచ్చు ఆ తర్వాత ఉప ఎన్నికలు వస్తే ఏమి జరుగుతుందో కూడా ఆయనకి తెలుసు,అందుకే మేము వాళ్ళ ఎంపీలతో రాజీనామా చేయించమని కోరుతున్నాం.సలహాదారులు విషయంలో అప్పట్లో ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయిస్తున్నాం,అప్పట్లో 100 కి పైగా సలహాదారులు ఉన్నారు…అవి కాక కన్సల్టెంట్లు 300 మంది వరకు ఉంటారు ఇలా పెట్టి పూర్తిగా వ్యవస్థను దుర్వినియోగం చేశారు జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు..అవసరమైన చోట మాత్రమే పెట్టారు.ఇలాంటి చిల్లర కామెంట్స్ మేము ఎప్పుడూ చేయలేదు పరకాల, కుటుంబరావులు రోజూ పొలిటికల్ డిబేట్స్ లో కూర్చునే వారు,అడ్డగోలు చర్చలు, మొత్తం రాజకీయం తప్ప వేరేది మాట్లాడే వారు కాదు మెమన్నా ముందు నుంచి రాజకీయంలో ఉన్నాం..వాళ్లకు రాజకీయాలతో సంబంధం లేకపోయినా రోజూ మాట్లాడేవారు ఆ రోజు వాళ్ళు చేస్తే కరెక్ట్…ఈ రోజు మమ్మల్ని తప్పుపట్టడం అంటే గురివిందలు నవ్వి పోతాయి.అమరావతిలో ఏమి జరిగింది అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కోర్టులో సాంకేతికంగా ఇబ్బంది ఉండి ఉండొచ్చు,ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే నిర్వచనం ఎలా ఇచుకున్నారో తెలియదు అమరావతి అనేదే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా చేసిన స్కాం అసైన్డ్ ల్యాండ్స్ ఏవిదంగా కొన్నారో మీడియాలో కూడా వచ్చాయి.టెక్నికల్ గ్రౌండ్స్ వల్ల రిజెక్ట్ చేసారేమో కానీ వాస్తవం న్యాయస్థానాలకు, టీడీపీ వారికి అందరికీ తెలుసు.గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని అంటే 20 కిలో మీటర్లు లోపలికి వెళ్లి ఎవరైనా భూములు కొంటారా…?అక్కడే వస్తుందని వాళ్లందరికీ ఎలా తెలుసు..ముందుగానే తెలుసు కాబట్టి అక్కడే కొన్నారు.అది న్యాయస్థానం తీర్పు…దానిపై కామెంట్ చేయలేము,అమరావతి వ్యవహారంలో అన్నీ అవకతవకాలే… కేసులు అనేకం ఉన్నాయి,అన్నీ బయటకు వస్తాయి… ఎవ్వరూ తప్పించుకోలేరు.పేరు ఏదైతే ఏముంది…చేసిన ప్రమాణాన్ని మరచి ప్రభుత్వ రహస్యం ఏవిధంగా బయటకు వచ్చింది..? ఆ కోణంలో వాళ్ళెవరూ తప్పించుకోలేరు కదా..? అది ప్రూవ్ అయితే అదీ తీవ్రమైన నేరం కాబట్టి తగిన శిక్ష పడుతుందని మేము భావిస్తున్నాం.
తగిన ఆధారాలు ఉన్న ఈ అంశానికి న్యాయస్థానాలు తగిన విధంగానే తీర్పు ఇస్తాయని ఆశిస్తున్నాం విశాఖ స్టిల్స్ కేంద్రం ఆస్తి… కొన్ని పరిమితులకు లోబడే రాష్ట్రం ఏదైనా చేయగలదు,ఏది చేసినా అక్కడి ఉద్యోగుల భద్రతకు డోకా రాకూడదనేది మా లక్ష్యం.దానికోసం ముఖ్యమంత్రి, మా ఎంపీలు పోరాడుతున్నారు…దాన్ని కొనసాగిస్తాం ఇక్కడి బీజేపీ వారిని కూడా కోరుతున్నాం…విశాఖ ఉక్కు నిలుపుకునేందుకు కృషి చేయాలి.రాజకీయాలకు తావు లేదు..రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 100 శాతం దాన్ని నిలుపుకోవాలి.విలైనంత వరకు దాన్ని ఆర్థికంగా నిలబెట్టడం, మైన్స్ సాధించుకోవడం ముఖ్యం.ఆ దిశగా కూడా ప్రయత్నం ప్రారంభించాం…కేంద్రము కూడా రాష్ట్రం పడే తపనని, సెంటిమెంటుని వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు,అందువల్ల ఒక పాజిటివ్ నిర్ణయం రావొచ్చని ఆశిస్తున్నాం.రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే ఆలోచన వేరు..ఎవరైనా దానికి వయబిలిటీ తెచ్చుకోవడం తప్పనిసరి,మైన్స్ కేటాయించాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి..మేము దాన్ని నిలుపుకోగలం అని నమ్మకం కేంద్రం పాజిటివ్ గా ఆలోచిస్తేనే వస్తుంది.టీడీపీ వాళ్ళ పార్టీ వారిని కూడా పోరాడమని చెప్తున్నాం మేము గుడ్డిగా డిమాండ్ చేయడం లేదు…ప్రత్యామ్నాయాలు చూపుతున్నాం,రఘురామరాజు విషయంలో సీఐడీ పెట్టిన కేసు నిజమని తెలుస్తోంది.అది నిజమని సీఐడీ చెప్పకముందే చిన్నపిల్లాడికి కూడా అది నిజమని తెలుసు జరుగుతున్నది ఓ పెద్ద కో ఆర్డినేటెడ్ కాన్స్పిరసీ.దాని వళ్ళ ఏమి సాదిస్తారో తెలియదు కానీ…కొన్ని వర్గాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర చేశారు దీనిలో తెరముందు రఘురామరాజు ఉంటే…దాని వెనుక పెద్ద వేరు చంద్రబాబు ఉన్నాడు,ఫోన్ లొనే అన్నీ బయటపడ్డాయి… వాటితో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా బయటపడ్డాయి.న్యాయమూర్తులను కూడా దుర్బాషలాడారు…కోర్టు దాన్ని సూమోటోగా తీసుకుంటుందని ఆశిస్తున్నాం.టీడీపీ లా ప్రతీ దానికి మేము కోర్టుల్లో కేసులు వేయించే అలవాటు మాకు లేదు కోర్ట్ సూమోటోగా తీసుకోవాల్సిన బాధ్యత ఉందని భావిస్తున్నాం,ఒక సీనియర్ జడ్జి గురించి అలా కామెంట్ చేయడం చాలా సీరియస్ విషయం అని మేము భావిస్తున్నాం దేవినేని ఉమా అడ్డగోలు ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు… ఇళ్ల నిర్మాణంలో ప్రతిదీ పారదర్శకంగా జరిగింది.ఎక్కడికక్కడ సోషల్ ఆడిట్ జరిగింది…ఎక్కడా అవినీతికి అవకాశం లేదు వాళ్ళ బతుకంతా స్కామ్ లు తప్ప వేరేది లేదు కాబట్టి వారి ఆలోచనలు కూడా అలానే ఉంటాయి.జగన్మోహన్ రెడ్డి మీరన్న స్కాం లు చేసే వారైతే లక్ష కోట్లకు పైగా డైరెక్ట్ ఖాతాల్లో వేయరు.మీ జన్మలో ఎప్పుడైనా జగన్ లాంటి ఆలోచనలు చేశారా..?మీలాగా జన్మభూమి కమిటీలు పీక్కు తినకుండా నేరుగా ప్రజలకు అందించారు.