విధాత:స్థానిక విజయవాడ ఏలూరు రోడ్డులో ఉన్న నారాయణ స్కూల్ దగ్గర ఎస్ఎఫ్ఐ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర మరియు కృష్ణాజిల్లా వ్యాప్తంగా విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే తల్లిదండ్రులకు ఫీజులవాత విద్యార్థులకు పుస్తకాల మోత తప్పడం లేదుని ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకంటే ఎక్కువ వసూలు చేయరాదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ పదేపదే హెచ్చరిస్తున్నా కొన్ని సంస్థలకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నా ఇవేమీ తమకు పట్టనట్టుగా కొన్ని యాజమాన్యాలు ఇష్టాను సారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయిని. కొన్ని యాజమాన్యాలు అయితే గత ఏడాది కన్నా ఇప్పటికీ ఫీజులు రెట్టింపు చేశాయి. మరికొన్ని చోట్ల రెండు,మూడు రెట్లు కూడా పెంచుకున్నాయి. ఈ దోపిడీ ఎల్.కె.జి నుండే ఆరంభమవ్ఞతున్నది. ఎల్.కె.జి కి లక్షలాది రూపాయలు వసూలు చేసే పాఠశాలలు పుట్టు కొచ్చాయి. పిల్లలనే కాదు వారి తల్లిదండ్రులను కూడా ఆర్థిక స్థోమతలను అంచనా వేసుకొని సీట్లు ఇస్తున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనలకులోబడే తాము సీట్లు కేటాయిస్తున్నట్లు నామమాత్రపు రసీదులు ఇస్తున్నారుని. ఈదోపిడీని భరించలేక అడిగిన ఫీజులు కట్టలేక కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. గత ఏడాది కూడా ఈ పరిస్థితి ఉండడంతో కొందరు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. నిర్దిష్టమైన ఆరోపణలతో ఏయే యాజమాన్యాలు ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారో సమగ్ర వివరాలతో ఫిర్యాదులు కూడా ఎస్ఎఫ్ఐ చేసిన చర్యలు తీసుకోలేదుని తెలిపారు. అధిక ఫిజులు దోపిడీపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ – (ఎస్ఎఫ్ఐ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.