విధాత: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్‌ను జారీ చేసింది. విజయవాడ డివిజన్‌లో పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. డివిజన్‌లో ట్రాఫిక్ బ్లాక్ దృష్ట్యా రైళ్లను రద్దు చేస్తున్న అధికారులు పేర్కొన్నారు. అలాగే పలు రైళ్లను దారి మళ్లించింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. విజయవాడ-తెనాలి (07279) రైలును ఈనెల 9 నుంచి 15 వరకు రద్దు చేసింది.
తెనాలి-విజయవాడ (07575) రైలు 15 వరకు, బిట్రగుంట-విజయవాడ (07977-07978) 11 నుంచి 15 వరకు, బిట్రగుంట-చెన్నై సెంట్రల్ (17237-17238) రైలును 9 నుంచి 13 వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ-ఒంగోలు (07461) 11 నుంచి 15 వరకు, ఒంగోలు-విజయవాడ (07576) 11 నుంచి 15 వరకు, విజయవాడ-గూడూరు (17259-17260) 11 నుంచి 15 వరకు, విజయవాడ-గూడూరు (07500) 11 నుంచి 15 వరకు, గూడూరు-విజయవాడ (07458) 12 నుంచి 16 వరకు, రాజమండ్రి-విశాఖపట్నం (07466-07467) 9 నుంచి 15 వరకు రద్దయ్యాయి.
ఇక గుంటూరు-విశాఖపట్నం (17239 17240) 9 నుంచి 16 వరకు, విజయవాడ-విశాఖపట్నం (22701-22702) 9 నుంచి 14 వరకు, రాజమండ్రి-విజయవాడ (07767) 9 నుంచి 15 వరకు, విజయవాడ-రాజమండ్రి (07459) 9 నుంచి 15 వరకు, మచిలీపట్నం-విశాఖపట్నం (17219-17220) 9 నుంచి 16 వరకు, విజయవాడ-గూడూరు (12743 12744) 11 నుంచి 16 వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ-గుంటూరు, విజయవాడ-రామవరప్పాడు వరకు పాక్షికంగా రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను విజయవాడ, గుడివాడ-భీమవరం మీదుగా మళ్లించినట్లు వివరించింది.
తెలంగాణలో నాలుగు రైళ్ల పొడిగింపు.. నేటి నుంచి ఈ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతయ్..!
రాష్ట్రంలో నడుస్తున్న పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇందులో మూడు ఎక్స్‌ప్రెస్‌లు, మరో ప్యాసింజర్ రైలు ఉన్నది. పొడిగించిన రైళ్లు నేటి నుంచి అమలులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జైపూర్ – కాచిగూడ వరకు నడుస్తున్న జైపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ( (919713-19714) ఏపీలోని కర్నూలు వరకు పొడిగించింది. తెలంగాణలోని షాద్‌నగర్, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల రైల్వేస్టేషన్లలో ఆగనున్నది. హైదరాబాద్- హడప్సర్ (పూణె) ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17013-17014) భువనగిరి, జనగామ మీదుగా కాజీపేట వరకు పొడిగించారు.
హెచ్‌ఎస్ నాందేడ్ – తాండూరు – పర్భణీ ఎక్స్‌ప్రెస్‌ను (17664-17663)ను సేడం, యాద్గిర్ మీదుగా రాయచూరు వరకు నడువనున్నది. అలాగే కరీంనగర్ – నిజామాబాద్ మధ్య నడిచే కరీంనగర్ ప్యాసింజర్ (07894-07893) బోధన్ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. పొడిగించిన రైళ్లు నేటి నుంచి అమలులోకి రానుండగా.. ఆయా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అడ్వాన్స్ బుకింగ్‌ను సైతం ప్రారంభించినట్లు రైల్వేశాఖ పేర్కొంది. పొడిగించిన రైళ్లను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది