సచివాలయ ఉద్యోగులకు స్పెషల్ డిపార్ట్మెంటల్ టెస్ట్ సెషన్
విధాత:గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రోబషన్ డిక్లరేషన్ కొరకు డిపార్ట్మెంటల్ టెస్ట్ లను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన విషయం అందరికీ తెలిసినదే. అందులో భాగంగా సచివాలయాల్లో పని చేస్తున్నటువంటి కొన్ని పోస్టులకు గానూ ఎటువంటి డిపార్ట్మెంటల్ కోడ్ లేకపోవడం వల్ల ఇప్పటి వరకు వారు డిపార్ట్మెంటల్ టెస్ట్ రాయలేకపోయారు. అందుకు గాను ప్రభుత్వం రెండు నెలల క్రితం ఒక ఆర్డర్ ను వేయడం జరిగింది అందులో ఎవరికి అయితే డిపార్ట్మెంటల్ టెస్టులు లేవో […]

విధాత:గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రోబషన్ డిక్లరేషన్ కొరకు డిపార్ట్మెంటల్ టెస్ట్ లను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన విషయం అందరికీ తెలిసినదే. అందులో భాగంగా సచివాలయాల్లో పని చేస్తున్నటువంటి కొన్ని పోస్టులకు గానూ ఎటువంటి డిపార్ట్మెంటల్ కోడ్ లేకపోవడం వల్ల ఇప్పటి వరకు వారు డిపార్ట్మెంటల్ టెస్ట్ రాయలేకపోయారు. అందుకు గాను ప్రభుత్వం రెండు నెలల క్రితం ఒక ఆర్డర్ ను వేయడం జరిగింది అందులో ఎవరికి అయితే డిపార్ట్మెంటల్ టెస్టులు లేవో వారికి వెంటనే వారి యొక్క పని రీత్యా, వారితో వారి డిపార్ట్మెంట్లో సరితూగే డిపార్ట్మెంటల్ టెస్ట్ కోడ్స్ ను ప్రభుత్వం వారికి మరియు ఏపీపీఎస్సీ కు సూచించ వలసిందిగా తెలియ జేస్తూ అదే విధంగా ఏపీపీఎస్సీ వారు సెప్టెంబర్ నందు స్పెషల్ టెస్ట్ ను కండక్ట్ చేసి రిజల్ట్స్ లను వెంటనే ఇవ్వాలని తెలియజేసింది. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ నెంబర్ 07/2021 విడుదల చేయడం జరిగింది.
➣డిపార్ట్మెంటల్ టెస్ట్ నోటిఫికేషన్ నెంబర్ : 07/2021
➣అప్లికేషన్ విధానం : ఆన్లైన్
➣అప్లికేషన్ ఆన్లైన్ చేయుటకు తేదీలు : 13.09.2021 నుంచి 17.09.2021
➣పరీక్షలు నిర్వహించే తేదీలు : 28/09/2021 నుంచి 30/09/2021
➣వెబ్సైటు : http://psc.ap.gov.in
➣అప్లికేషన్ ఫీజు : ప్రతి పేపర్కు 500/- రూ. లు
పరీక్షా విధానం :
➣ సర్వే వారికి మినహా మిగిలిన వారి అందరికీ ఆబ్జెక్టివ్ రూపం లో పరీక్ష ఉంటుంది
➣సర్వే అండ్ సెటిల్మెంట్ వారికి రాతపూర్వకంగా ఉంటుంది.
➣ పై రెండు పరీక్షలు కూడా కంప్యూటర్ బేస్డ్ లో ఉంటుంది.
➣మొత్తం మార్కులు 100, పాస్ అవ్వడానికి కావలసిన మార్కులు 40
➣ పేపర్ కోడ్ 137 మరియు 142 పేపర్లు రాసేవారు ఒకేసారి రెండు పేపర్లు పాస్ అవ్వవలసి ఉంటుంది రెండు పేపర్లలో కూడా కనీసం 40 మార్కులు రావాలి.
➣ ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష రాసే వారికి రెండు గంటలు అంటే 120 నిమిషాలు ఉంటుంది. పేపర్ పై అంటే కన్వెన్షనల్ మోడ్లో వ్రాసేవారికి మూడు గంటలు అంటే 180 నిమిషాలు ఉంటుంది.
టైం టేబుల్ :
పరీక్ష టైం టేబుల్ ను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ నందు పెట్టడం జరుగుతుంది
సిలబస్ :
➣ ప్రతీ డిపార్ట్మెంట్ యొక్క సిలబస్ను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ నందు పెట్టడం జరిగింది.
➣ సర్వే పేపర్లు అయినా 161 మరియు 162 సపరేట్గా సైట్ లో పెట్టడం జరిగింది
➣ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారి డిపార్ట్మెంటల్ కోడ్ 170 ( పుస్తకాలు లేకుండా ) ప్రస్తుతం వెబ్ సైట్ లో ఉంది
పరీక్ష సెంటర్లు :
రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాలలో పరీక్ష సెంటర్లు ఉంటాయి.దగ్గరలో ఉన్నటువంటి వేరొక జిల్లాలో పరీక్ష రాసే వెసులుబాటును ఏపీపీఎస్సీ కలిగిస్తుంది
డిపార్ట్మెంటల్ టెస్ట్ కోడులు:
➣ ఈ స్పెషల్ డిపార్ట్మెంటల్ సెషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం లో ఉన్నటువంటి కొందరు ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది.
➣ విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 3 వారి పేపరు తెలుగు లేదా ఇంగ్లీషులో ఉంటుంది. వారు ఏదో ఒక భాషను మాత్రమే ఎంచుకోవాలి. కొంత భాగం తెలుగు కొంతభాగం ఇంగ్లీష్ లో రాసినట్లు అయితే వాటిని అనర్హులుగా పరిగణిస్తారు.
ఆన్లైన్ విధానం :
మొదటిసారిగా ఏపీపీఎస్సీ నందు దరఖాస్తు పెడుతున్నట్టు అయితే మొదటగా OTPR వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తరువాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో మరియు సంతకం ఒకే ఫోటోల ఉండేలా చూసుకోవాలి.
Important Note :
ముందుగా డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసి పాస్ అయిన వారు మరల అదే కోడ్ కు స్పెషల్ డిపార్ట్మెంట్ టెస్ట్ సెషన్ లో అప్లికేషన్ పెట్టరాదు. అలా అప్లికేషన్ చేసిన వారిపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.