శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో సంచలనం
పంచాయతీరాజ్ ఇంజనీర్ల మూకుమ్మడి బదిలీలు ఇటీవల నియోజకవర్గ స్థాయి పంచాయతీరాజ్ శాఖ పరిధిలో అభివృద్ధి పనుల సమీక్ష సందర్భంగా ఇంజనీర్ల తీరు సక్రమంగా లేకపోవడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆ ప్రభావంతోనే ఆత్మకూర్ లో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఇంజనీర్లంతా బదిలీ అయినట్లు ఊహాగానాలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయినుంచి ఒక నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్లు అందరూ స్థానభ్రంశం చెందడం ఇదే తొలిసారి […]

పంచాయతీరాజ్ ఇంజనీర్ల మూకుమ్మడి బదిలీలు
ఇటీవల నియోజకవర్గ స్థాయి పంచాయతీరాజ్ శాఖ పరిధిలో అభివృద్ధి పనుల సమీక్ష సందర్భంగా ఇంజనీర్ల తీరు సక్రమంగా లేకపోవడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
ఆ ప్రభావంతోనే ఆత్మకూర్ లో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఇంజనీర్లంతా బదిలీ అయినట్లు ఊహాగానాలు
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయినుంచి ఒక నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్లు అందరూ స్థానభ్రంశం చెందడం ఇదే తొలిసారి
మంత్రి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష జరిగిన రెండు రోజులకే డిఈ నుంచి ఏఈల వరకు అందరూ బదిలీ
ఇప్పటికే కోట్ల రూపాయల పనులు మంజూరు చేస్తున్నప్పటికీ అభివృద్ధి పనులు మందగమనంలో సాగడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న మంత్రి మేకపాటి
ప్రజలకు ఏం కావాలో ముందే అంచనా వేసుకుని పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతుంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడంపై మంత్రి మండిపాటు
ఇప్పటికే పలుమార్లు తన నియోజకవర్గ స్థాయి అధికారులకు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎప్పటికప్పుడు పనులు చేసుకోవాలని అప్రమత్తం చేసిన మంత్రి గౌతమ్ రెడ్డి
తాను ఇచ్చిన స్వేచ్ఛని అలుసుగా తీసుకుని అలసత్వం ప్రదర్శించడంవల్లే మంత్రికి ఆగ్రహం తెప్పించిం ఉంటుందని అంటున్న నియోజకవర్గ నాయకులు
ప్రభుత్వం ఏర్పడి రెండు ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి మైలురాళ్లను నిలపాలని ఆది నుంచి తపన పడుతున్న మంత్రి మేకపాటి
ప్రజల వల్ల గెలిచిన నాయకులుగా ఆ ప్రజలకు చేయాలనుకున్న మంచి పనులు అనుకున్న సమయానికి పూర్తవకపోతే అంతే కఠినంగా ఉంటానని సంకేతాలిచ్చిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి
అంతకు ముందు సంవత్సరం కూడా ఇలాగే సుమారు రూ.150 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరు చేయించి, నిధులు కూడా విడుదలైనా పనులు జరగకపోవడంతో ఆవేశం ఆకాశాన్నంటి ఉండవచ్చంటూ సమాచారం
అవకాశం ఉన్న చోట కూడా ఇంజనీరింగ్ అధికారుల అశ్రద్ధ కనబడడం వల్లే ఇలా మూకుమ్మడి బదిలీలు జరిగి ఉంటాయని చర్చించుంటుకుంటున్న నియోజకవర్గ ప్రజలు నాయకులు.