కోవిడ్ ట్రీట్ మెంట్ పై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.

కోవిడ్ నియంత్రణకై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సూచనలు చేసిన ప్రధాన న్యాయమూర్తి ఆరుప్ కుమార్ గోస్వామి,న్యాయమూర్తి సి.ప్రవీణ్ కుమార్. రానున్న రోజుల్లో కోవిడ్ కేసులు పెరిగితే మీరేటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని ప్రశ్నించిన హైకోర్టు. ఆక్సిజన్ అందక చనిపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్న. కోవిద్ ట్రీట్ మెంట్ పై గుంటూరు కి చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు మరియు ఏ పి సి ల్ ఏ వేసిన పిల్ పై విచారణ. గత విచారణ […]

  • Publish Date - May 4, 2021 / 11:21 AM IST

కోవిడ్ నియంత్రణకై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సూచనలు చేసిన ప్రధాన న్యాయమూర్తి ఆరుప్ కుమార్ గోస్వామి,న్యాయమూర్తి సి.ప్రవీణ్ కుమార్.

రానున్న రోజుల్లో కోవిడ్ కేసులు పెరిగితే మీరేటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని ప్రశ్నించిన హైకోర్టు.

ఆక్సిజన్ అందక చనిపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్న.

కోవిద్ ట్రీట్ మెంట్ పై గుంటూరు కి చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు మరియు ఏ పి సి ల్ ఏ వేసిన పిల్ పై విచారణ.

గత విచారణ లో ప్రస్తావించిన ఆక్సిజన్, పడకలు,ఔషధాలు,కోవిడ్ పరీక్షల ఫలితాలు, వాక్సినేషన్ వంటి పలు కీలకమైన అంశాలపై గంటన్నర కు పైగా విచారణ.

అమికస్ క్యూరి గా సీనియర్ న్యాయవాది వై వి రవిప్రసాద్.

మరణించిన వారికి గౌరవ ప్రదంగా దహన సంస్కారాలు నిర్వహించాలని సూచన.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ వివరాలు గురువారం లోపు కోర్ట్ కు సమర్పించాలని ఆదేశం.

గురువారం కు వాయిద.తోట సురేష్ బాబు పిటిషనర్ తరపున నర్రా శ్రీనివాసరావు,ఏ పి సి ల్ ఏ తరపున పొత్తూరి సురేష్.

ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, ఏ ఏ జీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి,ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదనలు వినిపించారు.

Latest News