బాధితుల మీద కేసులా?
విధాత: ఒంగోలు 26వ డివిజన్ కార్పొరేటర్ రవితేజను వైకాపా నేతలు వేధిస్తూ అనేక ఇబ్బందులు పెడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు మండిపడ్డారు. ఎన్నికలు అయిన తర్వాత కూడా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవితేజ ఇంట్లోని మహిళలపై నీచంగా ప్రవర్తించిన వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారి మీద కేసులు పెట్టకుండా బాధితుల మీద, సంబంధం లేని వారి మీద కేసులు పెడుతున్నారని విమర్శించారు. తమ కార్యకర్తలు […]

విధాత: ఒంగోలు 26వ డివిజన్ కార్పొరేటర్ రవితేజను వైకాపా నేతలు వేధిస్తూ అనేక ఇబ్బందులు పెడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు మండిపడ్డారు. ఎన్నికలు అయిన తర్వాత కూడా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవితేజ ఇంట్లోని మహిళలపై నీచంగా ప్రవర్తించిన వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారి మీద కేసులు పెట్టకుండా బాధితుల మీద, సంబంధం లేని వారి మీద కేసులు పెడుతున్నారని విమర్శించారు. తమ కార్యకర్తలు సహనాన్ని పరీక్షించొద్దని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకుంటారని అచ్చెన్న హెచ్చరించారు.