గుంతల్లో రహదారి ఎక్కడ వుందో ఎతుక్కోవాల్సి వస్తోంది

అడుగడునా గుంత..ప్రయాణం చింత అన్నట్లుగా రాష్ట్రంలో రోడ్ల దుస్థితి దోచుకుని దాచుకోవడం మీదున్న శ్రద్ధ ప్ర‌జ‌ల‌మీద లేదు విధాత‌:కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుబ్జూరులోలో రోడ్ల పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతలపై వైసీపీ నేతలు మట్టిజల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు.ప్రతిపక్ష నాయకులకు కనీస రక్షణ కల్పించలేని నిస్సహాయ స్థితిలో పోలీసులున్నారు,మట్టిజల్లిన కిరాయి మూకలను అరెస్టు చేయకుండా టీడీపీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గం. గుంతల్లో రహదారి ఎక్కడ వుందో ఎతుక్కోవాల్సి వస్తోంది. అడుగడునా […]

  • Publish Date - July 24, 2021 / 11:18 AM IST

అడుగడునా గుంత..ప్రయాణం చింత అన్నట్లుగా రాష్ట్రంలో రోడ్ల దుస్థితి

దోచుకుని దాచుకోవడం మీదున్న శ్రద్ధ ప్ర‌జ‌ల‌మీద లేదు

విధాత‌:కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుబ్జూరులోలో రోడ్ల పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతలపై వైసీపీ నేతలు మట్టిజల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు.ప్రతిపక్ష నాయకులకు కనీస రక్షణ కల్పించలేని నిస్సహాయ స్థితిలో పోలీసులున్నారు,మట్టిజల్లిన కిరాయి మూకలను అరెస్టు చేయకుండా టీడీపీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గం. గుంతల్లో రహదారి ఎక్కడ వుందో ఎతుక్కోవాల్సి వస్తోంది. అడుగడునా గుంత..ప్రయాణం చింత అన్నట్లుగా రాష్ట్రంలో రోడ్ల దుస్థితి.సుమారు 8 వేల కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయి. రెండేళ్లుగా రోడ్లను వేయకపోగా గుంతల్లో తట్టమట్టి కూడా వేయలేని దిక్కుమాలిన ప్రభుత్వం వైసీపీ. తాడేపల్లి ప్యాలెస్ వదిలి రాష్ట్రంలో పర్యటిస్తే రోడ్ల దుస్థితితో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతుంది. దోచుకుని దాచుకోవడం మీదున్న శ్రద్ధ ప్రజలకు కల్పించే మౌళిక సదుపాయాలపై లేకపోతే ఎలా.? అని మండిప‌డ్డారు.