విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు

విధాత‌:విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు.విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడుతోంది,అసెంబ్లీలో తీర్మానం చేశామని, కేంద్రాన్ని ప్రశ్నించకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు.విశాఖ ఉక్కు అనుబంధ సంస్థలను సైతం ప్రైవేటీకరించేందుకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయటం దారుణం.విశాఖ ఉక్కు కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారు,ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని కేంద్ర ప్రభుత్వం […]

  • Publish Date - July 10, 2021 / 07:01 AM IST

విధాత‌:విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు.విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడుతోంది,అసెంబ్లీలో తీర్మానం చేశామని, కేంద్రాన్ని ప్రశ్నించకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు.విశాఖ ఉక్కు అనుబంధ సంస్థలను సైతం ప్రైవేటీకరించేందుకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయటం దారుణం.విశాఖ ఉక్కు కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారు,ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఉన్న పరిశ్రమలను మాత్రం ప్రైవేటీకరణ చేస్తోంది.అసెంబ్లీలో తీర్మానం చేశామని చేతులు దులుపుకోకుండా వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో పోరాటం చేయాలి.రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు టీడీపీ పోరాటానికి సిద్ధంగా వుంద‌న్నారు.