విధాత:ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అడిగింది రాష్ట్రాన్ని అభివృద్ధిచేయడానికి, ప్రజలను ఉద్ధరించడానికి కాదు. తనదోపిడీని పదికాలాలకు సరిపడా, పదింతలు చేసుకోవడానికి ఒక్కఛాన్స్ అని ప్రజలను నమ్మించాడు. ఇప్పుడు అధికారమనే తనరాక్షసపంజాను అమాయకులైన ఆదీవాసులపై విసిరాడు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, అటవీశాఖ అనుమతులు లేకుండా విశాఖమన్యంలో తనబంధువులతో కలిసి యథేచ్ఛగా మైనింగ్ మాఫియా నడిపిస్తున్నాడన్నారు టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు వంగలపూడి అనిత .
అటవీప్రాంతంలో గిరిజనుల ఆవాసాలనుకలుపుతూ రోడ్డేయాలంటేనే సవాలక్ష నిబంధనలు పాటించాలి. అలాంటిది 40మీటర్ల వెడల్పుతో మినీహైవేనునిర్మించి ఖనిజ సంపదను తరలిస్తున్నారు.డీఎఫ్ వో అనుమతి నిరాకరిస్తే, కలెక్టర్ అనుమతితో రాత్రికి రాత్రే ,ఎన్ఆర్ఈజీఎస్ నిధులతోభారీ రోడ్డు వేశారు.ఆ హైవేపై తిరుగుతున్న లారీలన్నీ భారతి సిమెంట్స్ వే.ఈస్టిండియా కంపెనీవారు దేశాన్ని దోచేసినట్లు, కడప కంపెనీలవారు మన్యంలోని విలువైనఖనిజ సంపదను దోచేస్తున్నారు. ఇంత జరుగుతుంటే, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, అటవీశాఖ వారు ఏంచేస్తున్నారు?విశాఖమన్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కు లేఖరాస్తున్నాం. తక్షణమే మైనింగ్ ఆపేలా, ఆదీవాసులను కాపాడేలా చర్యలు తీసుకోమని లేఖలో కోరాము.
గతంలో ప్రతిపక్షనేత హోదాలో చింతపల్లిలో భారీ బహిరంగ సభ పెట్టిన జగన్మోహన్ రెడ్డి, ఆనాడు ఆదీవాసీల జోలికొచ్చేవారి తలలు తెగనరుకుతామన్నాడు.మరిప్పుడుముఖ్యమంత్రి చేస్తున్నదానికి తన తలను తానే నరుక్కుంటాడా?రూ.15వేలకోట్ల విలువైనఖనిజదోపిడీకోసం ఆదీవా సుల జీవనవిధానాన్ని సర్వనాశనంచేయడానికి జగన్ ప్రభుత్వంపూనుకుంది.జగన్మోహన్ రెడ్డి ఖనిజదోపిడీదెబ్బకు ఉత్తరాంధ్ర బచావ్ అనే ఉద్యమం చేపట్టాల్సివచ్చేలా ఉంది. విలువైన ఖనిజాన్ని కడపకు తరలిస్తూ, జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలు సాగిస్తున్న దోపిడీని టీడీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ సాగనివ్వదు.