ఎవరిని మోసం చేయడానికి ఈ డ్రామాలు..!
విధాత,కడప జిల్లా:రాష్ట్ర మంత్రులు, ఛీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి పై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి ఫైర్ అయ్యారు.రెండు తెలుగు రాష్ట్రాల మద్య జలవివాదం జఠిలమౌతుంటే మంత్రులు పట్టీ పట్టనట్టు వ్యవహరించడం సిగ్గు చేటని పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పదకాన్ని అడ్డుకోని తీరుతామని తెలంగాణ మంత్రులు హెచ్చరిస్తుంటే నోరు ఎందుకు మెదపడం లేదన్నారు. తన తండ్రిని దూషిస్తున్నా పల్లెత్తు మాట మాట్లాడని సీఎం..లోకేశ్, చంద్రబాబు లపై మాత్రం పని గట్టుకోని విమర్శలు చేస్తున్న మంత్రులకు జల […]

విధాత,కడప జిల్లా:రాష్ట్ర మంత్రులు, ఛీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి పై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి ఫైర్ అయ్యారు.రెండు తెలుగు రాష్ట్రాల మద్య జలవివాదం జఠిలమౌతుంటే మంత్రులు పట్టీ పట్టనట్టు వ్యవహరించడం సిగ్గు చేటని పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పదకాన్ని అడ్డుకోని తీరుతామని తెలంగాణ మంత్రులు హెచ్చరిస్తుంటే నోరు ఎందుకు మెదపడం లేదన్నారు.
తన తండ్రిని దూషిస్తున్నా పల్లెత్తు మాట మాట్లాడని సీఎం..లోకేశ్, చంద్రబాబు లపై మాత్రం పని గట్టుకోని విమర్శలు చేస్తున్న మంత్రులకు జల వివాదంపై ఎందుకు ప్రశ్నించడం లేదు.లోకాయపారి ఓప్పందం చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..ఎవరిని మోసం చేయడానికి ఈ డ్రామాలు.న్యాయపరమైన సమస్యలు లేకుండా అన్ని రకాల అనుమతులతో పనులు చేపట్టి పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి.
సీమ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోని డ్రామాలను కట్టిపెట్టండి.ఉత్తుత్తి జీవోలు ఇవ్వడం కాదు సీమకు సాగు జలాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి.గుట్కా మాఫియా పై ఆరోపణలు చేస్తే ఛీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి ఎందుకు ఉలిక్కి పడుతున్నారు.దీన్ని బట్టి చూస్తే ఈ వ్యవహారం పై మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది.డీజీపీకి లేఖ రాశాక తనపై విచారణ జరుకోవచ్చు కాల్ డేటాను పరిశీలించుకోవాలని శ్రీకాంత్ రెడ్డి చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశమైనందునే ప్రశ్నించాం..దానికి అంతగా ఉలిక్కిపడాల్సిన అవసరమేమిటో అన్నారు.