దేశాన్ని గౌరవించేలా ప్రేరణ ఇచ్చేది భాజపా మాత్రమే

విధాత:భాజపాలో ఫాస్టర్ల చేరిక కార్యక్రమంలో సోమువీర్రాజు వెల్లడి మతం వ్యక్తిగతమైంది, దేశం ప్రధానమైంది. ఏ మతాన్ని ఆరాధించినా దేశాన్ని గౌరవించే ఆలోచనతో ప్రేరణకలిగించే పార్టీ భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అభివర్ణించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తాడేపల్లికి చెందిన లింగాల రత్నం ఆధ్వర్యంలో క్రిస్టియన్ ఫాస్టర్లు భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి పార్టీ అధ్యక్షులు సోమువీర్రాజు పార్టీ కండువాను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా […]

  • Publish Date - July 10, 2021 / 11:48 AM IST

విధాత:భాజపాలో ఫాస్టర్ల చేరిక కార్యక్రమంలో సోమువీర్రాజు వెల్లడి మతం వ్యక్తిగతమైంది, దేశం ప్రధానమైంది. ఏ మతాన్ని ఆరాధించినా దేశాన్ని గౌరవించే ఆలోచనతో ప్రేరణకలిగించే పార్టీ భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అభివర్ణించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తాడేపల్లికి చెందిన లింగాల రత్నం ఆధ్వర్యంలో క్రిస్టియన్ ఫాస్టర్లు భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి పార్టీ అధ్యక్షులు సోమువీర్రాజు పార్టీ కండువాను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశం తర్వాతే మతం. ఈ అంశాన్ని భాజపా మాత్రమే చెబుతుందని అన్నారు.
మిగతా పార్టీలు చెప్పవు. ఆ పార్టీలకు ఓటు బ్యాంకు రాజకీయాలు కావాలని చెప్పారు. భాజపా దేశహితం కోరి, దేశభక్తిని ప్రేరేపించే వ్యవస్థగా 1981లో ఏర్పడింది. ఈ ఆలోచనతో నడుస్తూ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. భాజపా దేశానికి అనుగుణంగా పనిచేసే వ్యవస్థగా పేర్కొన్నారు. మనం దేశాన్ని గౌరవించాలి. హిందువులకు మత గ్రంధం లేదు. ఒక దేవుడు లేడు. ఒక దేవుడినే ఆరాధించాలనే నియంత్రణ లేదు. మనుషులు, జంతువులు, ప్రకృతి, చెట్లు, చివరికి శవంలో కూడా దేవుడిని చూస్తారు. అలాగే ఆస్తికులతో పాటు హిందువుల్లో నాస్తికులు కూడా ఉన్నారన్నారు.
ఇలా విస్తృతమైన ఆలోచనా సరళితో, స్వేచ్ఛాయుత వాతావరణం అనుసరిస్తోన్న హిందుత్వం ఒక జీవన విధానంగా వివరించారు. అందుకే మతం మారిన క్రైస్తవులు కూడా వివాహాది సందర్భాల్లో భారతీయ సంప్రదాయాలనే అనుసరిస్తున్నారని చెప్పారు. దేశం ఇలాంటి అద్భుత ఆలోచనతో నడుస్తోందని, అందుకే విదేశీ క్రైస్తవులు బైబిల్ను కాళ్లదగ్గర పెట్టుకుంటే మనం హృదయం వద్ద ఉంచుతామని ఉదాహరణగా పేర్కొన్నారు. భారతీయతలో విస్తృతమైన సైకాలజీ ఉంది అందరం కలసి పనిచేస్తూ దేశ అభివృద్ధిలో భాగం పంచుకుందాం. భక్తులు ఇచ్చిన కానుకలతోనే ప్రార్ధనా నిర్మాణాలు జరగాలి. అంతేకాని ప్రభుత్వ సొమ్ముతో కాదు. మతపరమైన ఆలోచనతతో కాకుండా విధానపరమైన ఆలోచనతో భాజపా దీనిని వ్యతిరేకించే పరిస్తితి తీసుకొస్తుంది. సభాధ్యక్షులుగా మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ష్బాజి వ్యవహరించారు. అబ్రహాం, కె.ప్రభుదాస్, కాటూరి ప్రభుదాస్, మనోజ్, రాజేష్, శంకరరావు, ఎం.మైఖేల్, తదితరులు పార్టీలో చేరారు.