ఫలించిన గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కల

పల్నాడుకు మణిహారం పిడుగురాళ్ల మెడికల్ కళాశాలకు 31 సోమవారం ఉదయం వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్. గురజాల ఆర్డీవో పార్థసారథి వెల్లడి పల్నాడు ప్రజల చిరకాల వాంఛ సోమవారం కార్యరూపం దాల్చనున్న దని గురజాల ఆర్ డి ఓ జగన్నాథం పార్థసారథి వెల్లడించారు.పిడుగురాళ్ల సమీపంలోని బ్రాహ్మణ పల్లి వద్ద సుమారు 50 ఎకరాల స్థలంలో 500 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సీఎం వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేస్తారని ఆర్డీవో చెప్పారు. […]

ఫలించిన గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కల

పల్నాడుకు మణిహారం పిడుగురాళ్ల మెడికల్ కళాశాలకు 31 సోమవారం ఉదయం వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్.

గురజాల ఆర్డీవో పార్థసారథి వెల్లడి

పల్నాడు ప్రజల చిరకాల వాంఛ సోమవారం కార్యరూపం దాల్చనున్న దని గురజాల ఆర్ డి ఓ జగన్నాథం పార్థసారథి వెల్లడించారు.పిడుగురాళ్ల సమీపంలోని బ్రాహ్మణ పల్లి వద్ద సుమారు 50 ఎకరాల స్థలంలో 500 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సీఎం వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేస్తారని ఆర్డీవో చెప్పారు.

రెండు సంవత్సరాలలో ఈ కళాశాలను పూర్తిచేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన తెలిపారు.వైద్యరంగంలో పల్నాడు వెనకబడి ఉన్న విషయాన్ని గణాంకాలతో సహా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వివరించి పల్నాడుకు భారీ ప్రాజెక్టు అయిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను సాధించి పెట్టారని తెలిపారు.

పిడుగురాళ్ల మెడికల్ కళాశాల పూర్తయితే పల్నాడు లో ఉన్న 10 లక్షల జనాభాకు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు.పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 500 నుండి వెయ్యి పడకల తో కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు.
అంతేగాక 500 మంది వైద్య విద్యార్థులు విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందని ఆర్ డి ఓ పార్థసారధి తెలిపారు.

నాడు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి పల్నాడును వెలలేని మాగాణి చేయగా నేడు ఆయన మనవడు కాసు మహేష్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన పిడుగురాళ్ల మెడికల్ కళాశాల సాధించి పల్నాడు రూపురేఖలు మార్చటం హర్షణీయమని ఆర్డీవో పార్థసారథి పేర్కొన్నారు.