జులై 22 నుంచి సర్పంచ్ లకు శిక్షణ తరగతులు

విధాత‌:నిమ్రా కాలేజీలో ఏర్పాట్లు పరిశీలించిన జడ్పీ సీఈవో పి.ఎన్. సూర్యప్రకాష్, జిల్లాపంచాయతీ అధికారి పి.జ్యోతి ,భారత రాజ్యాంగం గ్రామ పంచాయతీలకు కల్పించిన ప్రాముఖ్యత, సర్పంచ్ ల అధికారాలు, విధులు, గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో సూర్యప్రకాష్ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని జూపూడి నిమ్రా ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం నుంచి ప్రారంభం కానున్న విజయవాడ డివిజన్ స్థాయి సర్పంచ్ ల శిక్షణ తరగతుల ఏర్పాట్లను బుధవారం వారు పరిశీలించారు.విజయవాడ డివిజన్ […]

  • Publish Date - July 21, 2021 / 04:14 PM IST

విధాత‌:నిమ్రా కాలేజీలో ఏర్పాట్లు పరిశీలించిన జడ్పీ సీఈవో పి.ఎన్. సూర్యప్రకాష్, జిల్లాపంచాయతీ అధికారి పి.జ్యోతి ,భారత రాజ్యాంగం గ్రామ పంచాయతీలకు కల్పించిన ప్రాముఖ్యత, సర్పంచ్ ల అధికారాలు, విధులు, గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో సూర్యప్రకాష్ తెలిపారు.

ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని జూపూడి నిమ్రా ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం నుంచి ప్రారంభం కానున్న విజయవాడ డివిజన్ స్థాయి సర్పంచ్ ల శిక్షణ తరగతుల ఏర్పాట్లను బుధవారం వారు పరిశీలించారు.విజయవాడ డివిజన్ కు సంబంధించి మూడు రోజులు జరిగే శిక్షణ తరగతులకు విచ్చేసే సర్పంచులకు వసతి సౌకర్యాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా డి.పి.ఓ జ్యోతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సర్పంచ్ లకు ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ప్రాథమిక శిక్షణ తరగతుల్లో భాగంగా జిల్లాలోని నాలుగు డివిజన్లలో ఈ శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి గ్రామీణాభివృద్ధి వారి పాఠ్యాంశాల ఆధారంగా శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు(రిసోర్స్ పర్సన్స్) సర్పంచ్ లకు శిక్షణ ఇస్తారని చెప్పారు.

జడ్పీ సీఈఓ సూర్యప్రకాష్ మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేస్తోందన్నారు. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు, ప్రజారోగ్య పరిరక్షణకు వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, ఎన్నో ప్రజోపయోగమైన, అత్యంత విప్లవాత్మకమైన వ్యవస్థలను ప్రారంభించారని తెలిపారు. ఈ వ్యవస్థలను ఉపయోగించుకొని సర్పంచ్ లు పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి పథంలో నిలపాలి? ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.

ప్రారంభ కార్యక్రమానికి జిల్లా ఇన్ చార్జి మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య( నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు(నాని) వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో చంద్రశేఖర్, ఇబ్రహీంపట్నం ఎంపీడీవో దివాకర్, తహసీల్దార్ సూర్యారావు, మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ కుమార్, ఈవోఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.