రిజిస్ట్రేషన్‌పై శిక్షణ.. సచివాలయ సిబ్బందికి రిజిస్ట్రేషన్‌పై శిక్షణ

విధాత,హిందూపురం: ప్రభుత్వం సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల కార్యదర్శులకు, డిజిటల్‌ ఆపరేటర్లకు జులై ఒకటో తేదీ నుంచి శిక్షణ ఇస్తున్నట్లు హిందూపురం జిల్లా రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరి తెలిపారు. పెనుకొండ సబ్‌ డివిజన్‌లో సోమందేపల్లి, ధర్మవరం డివిజన్‌లో బత్తలపల్లి, కదిరి డివిజన్‌లో గాండ్లపెంట సచివాలయ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇస్తున్నారు.మొత్తం 44 రోజుల పాటు రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్‌, మున్సిపల్‌, సచివాలయాల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్స్‌ వస్తాయి..ఆస్తి మదింపులు ఎలా […]

రిజిస్ట్రేషన్‌పై శిక్షణ.. సచివాలయ సిబ్బందికి రిజిస్ట్రేషన్‌పై శిక్షణ

విధాత,హిందూపురం: ప్రభుత్వం సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల కార్యదర్శులకు, డిజిటల్‌ ఆపరేటర్లకు జులై ఒకటో తేదీ నుంచి శిక్షణ ఇస్తున్నట్లు హిందూపురం జిల్లా రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరి తెలిపారు. పెనుకొండ సబ్‌ డివిజన్‌లో సోమందేపల్లి, ధర్మవరం డివిజన్‌లో బత్తలపల్లి, కదిరి డివిజన్‌లో గాండ్లపెంట సచివాలయ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇస్తున్నారు.మొత్తం 44 రోజుల పాటు రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్‌, మున్సిపల్‌, సచివాలయాల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్స్‌ వస్తాయి..ఆస్తి మదింపులు ఎలా లెక్కించాలి.

రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు ఎలా నిర్ణయించాలి, అసైన్డ్‌, ప్రభుత్వ, దేవాదాయ భూములు ఎలా గుర్తించాలి.. రిజిస్ట్రేషన్‌ సమయంలో పొందుపరచాల్సిన పత్రాలు.. తదితర విషయాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వారు ఇతర సచివాలయాల సిబ్బందికి శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.

త్వరలోనే సచివాలయాల్లో సైతం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరగనుందని చెప్పారు. సాఫ్ట్‌వేర్‌లో సైతం తదనుగుణంగా మార్పులు చేశారన్నారు. రిజిస్ట్రేషన్‌ ఇక సులభతరం కావడమే కాకుండా ఎప్పటికప్పుడు క్రయ, విక్రయాలు జరిగిన వెంటనే రికార్డుల బదలాయింపులు జరగడంతో వివాదాలకు ఆస్కారం తగ్గుతుందన్నారు.