Balakrishna | న‌టుడు బాల‌కృష్ణ‌కు త‌ప్పిన ప్ర‌మాదం..

Balakrishna | హిందూపురం ఎమ్మెల్యే, సీనియ‌ర్ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌కు తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. నిన్న త‌న నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి అనే కార్య‌క్ర‌మంలో బాల‌య్య పాల్గొని ప్ర‌సంగించారు. ప్ర‌సంగం ముగిసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌కు అభివాదం చేసి.. వాహ‌నం దిగుతుండ‌గా, అది ఒక్క‌సారిగా ముందుకు క‌దిలింది. దీంతో బాల‌కృష్ణ వెన‌క్కి తూలి కింద‌ప‌డ‌బోయాడు. ప‌క్క‌నే ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి గోపాల్ రెడ్డి, ఇత‌ర నాయ‌కులు బాల‌కృష్ణ‌ను పట్టుకున్నారు. దీంతో బాల‌కృష్ణ ప్ర‌మాదం నుంచి […]

Balakrishna | న‌టుడు బాల‌కృష్ణ‌కు త‌ప్పిన ప్ర‌మాదం..

Balakrishna | హిందూపురం ఎమ్మెల్యే, సీనియ‌ర్ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌కు తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. నిన్న త‌న నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి అనే కార్య‌క్ర‌మంలో బాల‌య్య పాల్గొని ప్ర‌సంగించారు. ప్ర‌సంగం ముగిసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌కు అభివాదం చేసి.. వాహ‌నం దిగుతుండ‌గా, అది ఒక్క‌సారిగా ముందుకు క‌దిలింది. దీంతో బాల‌కృష్ణ వెన‌క్కి తూలి కింద‌ప‌డ‌బోయాడు. ప‌క్క‌నే ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి గోపాల్ రెడ్డి, ఇత‌ర నాయ‌కులు బాల‌కృష్ణ‌ను పట్టుకున్నారు. దీంతో బాల‌కృష్ణ ప్ర‌మాదం నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌పడ్డాడు.

ఇక అక్కినేని నాగేశ్వ‌ర్ రావు విష‌యంలో బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. వీర‌సింహా రెడ్డి స‌క్సెస్ మీట్‌లో బాల‌య్య మాట్లాడుతూ.. షూటింగ్ స‌మ‌యంలో ఏయే అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయో తెలిపారు. అంద‌రూ అద్భుతంగా న‌టించారు. నాకు మంచి టైంపాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్న గారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునేవాళ్లం అని బాల‌య్య‌ చెప్పారు. బాల‌కృష్ణ కామెంట్స్‌పై అక్కినేని అభిమానులు, నాగార్జున ఫ్యాన్స్ తీవ్రంగా మండిప‌డ్డారు.

మొత్తంగా త‌న వ్యాఖ్య‌ల‌పై నిన్న హిందూపురంలో బాల‌య్య స్ప‌ష్ట‌త ఇచ్చారు. బాబాయ్‌(అక్కినేని నాగేశ్వరరావు)పై ప్రేమ గుండెల్లో ఉంటుందని, బయట ఏం జరిగినా తాను పట్టించుకోనని స్ప‌ష్టం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు నాకు బాబాయి లాంటి వారు. అభిమానంతోనే యాధృచ్చికంగా అన్నాను. ఎన్టీఆర్​, ఏఎన్నార్ అలాగే అనేవారు. నేను ఎప్పుడైనా రోడ్డుపై వెళ్తుంటే బాలయ్య వెళ్తున్నాడనే అంటారు. అది అభిమానంతోనే ఫ్యాన్స్​ అలా అంటారు అంతే. ప్రతిమాటకు బాధపడాల్సిన అవసరం లేదు అని బాల‌కృష్ణ వివ‌ర‌ణ ఇచ్చారు. నాగేశ్వరరావు తన పిల్లలకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారు. నాన్న పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించాం అని బాల‌య్య గుర్తు చేశారు.