గుంతల మధ్య రోడ్లను కళ్ళకు కడుతున్న ఫోటోలు, వీడియోలు
192.9 మిలియన్లకు #JSPForAP_Roads ద్వారా రోడ్ల దుస్థితి రీచ్
విధాత: జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు కు విశేష స్పందన లభించింది.ఈ ఉద్యమం ట్విట్టర్ ట్రెండింగ్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో, జాతీయ స్థాయిలో 5వ స్థానం లో నిలిచింది.రోడ్లను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో ప్రజలే చూపించారంటున్న జనసేన నేతలు.గజానికో గొయ్యిలా రాష్ట్రంలో రహదారులు ఉన్నాయని పవన్ కల్యాణ్ చెప్పిన విషయం అక్షర సత్యం అని ఈ డిజిటల్ ఉద్యమంలో వస్తున్న ఫోటోలు, వీడియోలు చూస్తే అందరకీ అర్థం అవుతుందని వెల్లడించారు. నెల రోజుల్లో ఈ రోడ్ల ను ప్రభుత్వం బాగు చేయించాలని డిమాండ్ లేకుంటే అక్టోబర్2వ తేదీ నుంచి శ్రమదానం తో జన సైనికులే బాగు చేయాలని పిలుపు.