విధాత,అమరావతి: పోలవరం మాజీ ఎమ్మెల్యే వంక శ్రీనివాసరావు మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శ్రీనివాసరావు విశేషంగా కృషి చేశారన్నారు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని చంద్రబాబు తెలియజేశారు.