విధాత:గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో అత్యాచార బాధితులను పరామర్శించిన మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ. వికలాంగ యువతి మరియు 7 నెలల పాపపై లైంగిక దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబ సభ్యులకు వాసిరెడ్డి పద్మ హామీ.
నరసరావుపేట, రొంపిచర్ల మండలంలో మాటలు రాని వికలాంగురాలైన యువతిపై అదే గ్రామానికి చెందిన ఆలూరి శేషాలు అత్యాచారం చేయడం దుర్మార్గమని, మాచర్ల మండలంలో 7 నెలల పసి పాపను నిద్రపోతున్న సమయంలో ఎత్తుకెళ్లి లైంగిక దాడి చేయడం హృదయవిదారకమని మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ ఆవేదన వ్యక్తం చేసారు. వాసిరెడ్డి పద్మ వెంట మహిళా కమిషన్ సభ్యురాలు జయశ్రీ, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావతి ఉన్నారు.