" /> " /> " /> " />
విధాత: పట్టణీకరణకు అనుగుణంగా అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 38వ డివిజనులో రూ.170.00 లక్షల అంచనా వ్యయంతో నిర్మించుకున్న STP (సీవెజ్ ట్రీట్ మెంట్ ప్లాంటు) “మురుగునీటి శుద్ధి ప్లాంటునకు” పున్నమి ఘాట్ వద్ద దేవదాయ ధర్మదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శంఖుస్ధాపన చేశారు..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి హయంలో విజయవాడ నగరం అభివృద్ది పధంలో దూసుకుపోతుందన్నారు. ఈ ప్రాంతంలో తర్వలో స్టేడియం, రైతు బజారు నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. అదే విధంగా విభినమైన పార్క్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. మురుగు నీటిని సైతం సద్వినియోగం చేసుకునే విధంగా ప్రయోగత్మకంగా “మురుగునీటి శుద్ధి ప్లాంటునకు శుంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఆసిప్, డిప్యూటీ మేయర్లు శ్రీమతి బెల్లం దుర్గ, కార్పొరేటర్ శ్రీమతి షేక్ రెహంతున్నీసా, చైతన్య రెడ్డి, అంజనేయ రెడ్డి, గుడివాడ నరేంద్ర, మైలవరపు రత్నకుమారీ, మొహమ్మద్ ఇర్పాన్, బాపతి కొటిరెడ్డి, తదితరులు ఉన్నారు.