విధాత:శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం పులుపునిచ్చారు. పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో దిశా యాప్ పై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ దిశా యాప్ విప్లాత్మకమైనదన్నారు. దిశా చట్టం మనలను రక్షిస్తుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన ఘటనతో ముఖ్య మంత్రి ప్రత్యేక చట్టం తీసుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. మహిళల్లో ఆత్మన్యూనత భావం ఉందని, దానిని తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పురుషాహంకార సమాజంలో మహిళల మానసిక స్థితి మారాలని అభిప్రాయపడ్డారు. ముఖ్య మంత్రి గొప్ప మానవతా వాది అన్నారు. మన సంస్కృతిలో మహిళలకు పెద్ద పీట వేయడం జరిగిందని ఆయన చెప్పారు. పురుషాహంకారనికి దిశా యాప్ శాపంగా మారిందని ఆయన అన్నారు. పురుషుల ఆలోచనా ధోరణి మారాలని స్పీకర్ అభిప్రాయపడ్డారు. దోషులకు శిక్ష పడాలని ఆయన పేర్కొన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రయోజనకర యాప్ అన్నారు. యాప్ డౌన్ లోడ్ డ్రైవ్ పెట్టాలని ఆయన సూచించారురాష్ట్ర పశుసంర్ధక, మత్స్య శాఖ మంత్రి డా. సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ దేశ రాజధానిలో నిర్భయ సంఘటన దేశంలో సంచలనం సృష్టించిందన్నారు. దిశా చట్టం ప్రకారం తక్కువ సమయంలో విచారణ పొంది శిక్ష పడుటకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరంను ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. మహిళల్లో భద్రత భావం కల్పించుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రతి మహిళా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని గ్రామ సచివాలయ వ్యవస్థ ఉందని, మహిళా పోలీసు లతో అవగాహన కల్పించాలని, వారి సేవలు పొందాలని సూచించారు. మహిళా పోలీసు అందుబాటులో ఉన్నారనే విషయం ప్రజలకు కూడా తెలుస్తుందని ఆయన అన్నారు. జగన్ మోహన్ రెడ్డి లక్ష్యాన్ని మహిళా పోలీసు ద్వారా సాధించాలని మంత్రి తెలిపారు. అక్రమ మద్యం నివారించడంలోను మహిళా పోలీసు సేవలు వినియోగించాలని ఆయన సూచించారు.
శాసన సభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ ప్రతి తల్లి పిల్లల భద్రత కోసం ఆలోచిస్తారన్నారు. ముఖ్య మంత్రి మహిళల ఆత్మగౌరవం కోసం అండగా నిలిచారని పేర్కొన్నారు. మహిళల రక్షణ దీక్షగా ముఖ్య మంత్రి పూనుకున్నారని చెప్పారు. ప్రయాణ సమయంలో పోలీసు శాఖ నంబర్లు అవసరమని, యాప్ లో అవి లబ్యంగా ఉన్నాయని చెప్పారు.
జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ వినూత్న రీతిలో యాప్ ను ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఉద్యోగినులు అత్యంత ఉపయోగరమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వం యాప్ ను ప్రవేశ పెట్టిందని ఆయన పేర్కొన్నారు. యాప్ పై ఇంకా అవగాహన పెంచుకోవాలని కోరారు. ఎస్ఓఎస్ బటన్ నొక్కడం లేదా ఫోన్ ను ఐదు సార్లు ఊపినా (షేక్ చేసినా) సమాచారం పోలీసులకు చేరుతుందని ఆయన వివరించారు. ముఖ్య మంత్రి ప్రత్యేక శ్రద్ధతో యాప్ ను తీసుకువచ్చారని కలెక్టరు ఆన్నారు. వన్ స్టాప్ కేంద్రంలో న్యాయ సలహా పొందవచ్చని సూచించారు. జిల్లాలో 2.90 లక్షలు మంది యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని, అయితే 6 లక్షల మంది వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని చెప్పారు.
పోలీస్ సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ ప్రతి 16 నిమిషాలకు ఒక మహిళ పై లైంగిక దాడి జరుగుతుందని ఒక సర్వే తెలిపిందని చెప్పారు. మహిళా రక్షణకు దిశా యాప్ గొప్ప అవకాశమని, సామాజిక భద్రత కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. అసాంఘిక శక్తులు మనకు చెప్పిరారని, దిశా యాప్ ఉంటే అటువంటి వారి ఆటకట్టించ వచ్చని అన్నారు. ప్రతి ఒక్కరు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలనీ సూచించారు.
మహిళా పోలీసు ఐశ్వర్య మాట్లాడుతూ ఎస్ఓఎస్ బటన్ నొక్కితే రక్షణ పొందే అవకాశం దిశా యాప్ ద్వారా సాధ్యమన్నారు.
ఈ సందర్భంగా దిశా యాప్ పోస్టర్ ను ఆవిష్కరించారు. వీడియోలను ప్రదర్శించారు. పోలీసు సిబ్బది దిశా యాప్ ను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కే.శ్రీనివాసులు, పలాస మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. జయ దేవి, మహిళా ఆర్థిక కార్పొరేషన్ చైర్ పర్సన్ గా నియమితులైన బల్లాల హేమ మాలిని రెడ్డి, అదనపు ఎస్పీ పి.సోమశేఖర్, డీఎస్పీలు ఎం.మహేంద్ర, ఎం. శ్రావణి, ఎస్.వాసు దేవ్, ఎం.వీర కుమార్, సీఐ అంబేద్కర్, యస్ఐలు, మహిళ వైద్యులు, మహిళ పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్స్, మహిళ కండక్టర్స్, ఐసీడిఎస్ మహిళ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు