ఆంధ్ర అభ్యసన పరివర్తన కార్య‌క్ర‌మానికి ప్ర‌పంచ బ్యాంకు 1860 కోట్ల ఆర్థిక సాయంః విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్

విధాత ,అమ‌రావ‌తిః అంతర్జాతీయ పునర్నిర్మాణ మరియు అభివృద్ధి బ్యాంకు (IBRD) ఆంధ్ర అభ్యసన పరివర్తన (Supporting andhra's Learning Transformation) (SALT) కార్యక్రమానికి నిధులను మంజూరు చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి 250 మిలియన్ అమెరికన్ డాలర్లు (మన కరెన్సీలో 1,860 కోట్ల రూపాయలు) ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ […]

ఆంధ్ర అభ్యసన పరివర్తన కార్య‌క్ర‌మానికి ప్ర‌పంచ బ్యాంకు 1860 కోట్ల ఆర్థిక సాయంః విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్

విధాత ,అమ‌రావ‌తిః అంతర్జాతీయ పునర్నిర్మాణ మరియు అభివృద్ధి బ్యాంకు (IBRD) ఆంధ్ర అభ్యసన పరివర్తన (Supporting andhra’s Learning Transformation) (SALT) కార్యక్రమానికి నిధులను మంజూరు చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి 250 మిలియన్ అమెరికన్ డాలర్లు (మన కరెన్సీలో 1,860 కోట్ల రూపాయలు) ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ గారికి కమల్ అహ్మద్ (కంట్రీ డైరెక్టర్, ఇండియా) (ప్రపంచ బ్యాంకు) నుండి లేఖ అందింది.

నాడు నేడులో భాగంగా మౌలిక సౌకర్యాల రూప కల్పన, నిర్వహణ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యం తన నిబద్ధతను పునరుద్ఘాటించి లక్ష్యాల సాధనకు కట్టుబడి వున్నది . ముఖ్యంగా పాఠశాల మరుగుదొడ్ల నిర్మాణం లొనూ, పారిశుధ్య కార్మికుల నియామకం ,శిక్షణలకు ప్రధమ ప్రాధాన్యతనిస్తుంది. మొదటి దశ నాడు నేడు పనులు జరిగిన తీరుతో సంతృప్తి చెందటంతో పాటు రాష్ట్రంలో అమలవుతున్న అనేక పధకాలపై ప్రభుత్వం తో చర్చలు జరిపిన ఈ పధకం బృందం ప్రతిపాదనతో ప్రపంచ బ్యాంకు రుణాన్ని మంజూరు చేసిందని మంత్రి తెలిపారు.