Beauty tips | యుక్త వయస్సులోనే జుట్టు రాలిపోతోందని బాధా.. డోంట్ వర్రీ..!
Beauty tips : జుట్టు రాలిపోవడం అనేది ఈ రోజుల్లో సాధారణ విషయంగా మారిపోయింది. పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిళ్లతో కూడిన జీవన విధానం, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా ఇదొక ప్రధాన సమస్యగా పరిణమించింది. అయితే ఐదుపదుల వయసు దాటినోళ్లకు జుట్టు రాలిపోవడం సహజం.
Beauty tips : జుట్టు రాలిపోవడం అనేది ఈ రోజుల్లో సాధారణ విషయంగా మారిపోయింది. పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిళ్లతో కూడిన జీవన విధానం, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా ఇదొక ప్రధాన సమస్యగా పరిణమించింది. అయితే ఐదుపదుల వయసు దాటినోళ్లకు జుట్టు రాలిపోవడం సహజం.
కానీ రోజుల్లో రెండు పదులు, మూడు పదుల వయస్సు కూడా నిండని చాలామంది జుట్టురాలే సమస్యతో బాధపడుతున్నారు. హార్మోన్ల వృద్ధిలో లోపాలు, విటమిన్‌ల లోపాలు, సమయానికి తిండి లేకపోవడం, నిద్రలేమి లాంటివి కూడా జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అయితే ఈ జుట్టురాలే సమస్యకు నిపుణులు కొన్ని పరిష్కారా మార్గాలు సూచిస్తున్నారు.
ఇవీ పరిష్కారాలు..
- జుట్టు రాలిపోవడాన్ని గుర్తించగానే ఎలాంటి ఆందోళన చెందకుండా వైద్య నిపుణులను సంప్రదించండి. మానసికంగా ఆందోళన చెందితే సమస్య మరింత తీవ్రమవుతుంది.
- ప్రొటీన్‌ల లోపంవల్ల కూడా జుట్టు రాలుతుంది. మాంసంలో, పప్పుల్లో ప్రొటీన్‌లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రొటీన్ లోపం ఉన్నవాళ్లు మాంసాహారం, పప్పులు ఎక్కువగా తీసుకోవాలి.
- విటమిన్‌లు లోపించడంవల్ల కూడా జుట్టురాలే సమస్య వస్తుంది. అందువల్ల విటమిన్లను ఆహారం రూపంలోగానీ, క్యాప్స్యూల్స్ రూపంలోగానీ తీసుకునేందుకు ప్రయత్నించండి.
- కొంతమంది జుట్టుకు ఎలాంటి నూనెలు రాయకుండా అశ్రద్ధ చేస్తుంటారు. దాంతో జుట్టు పొడిగా తయారై, బలహీనపడి రాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి కనీసం రెండు రోజులకు ఒకసారైనా తలకు నూనె రాసుకుంటే మంచిది.
- ఫ్యాషన్ పేరుతో యువత జుట్టుకు రకరకాల రంగులను రుద్దుతుంటారు. ఇలా చేయడంవల్ల జుట్టు సహజత్వాన్ని కోల్పోయి బలహీనపడుతుంది. అందువల్ల రంగులను వీలైనంత తక్కువగా వాడితే మంచిది.
- అదేవిధంగా కొంతమంది జుట్టుకు రకరకాల షాంపోలను వాడుతుంటారు. ఇది అన్నింటికంటే ప్రమాదకరం. కాబట్టి మాటిమాటికి షాంపూలను మార్చకుండా ఒకేరకమైన షాంపూలను వాడాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram