డ్రగ్స్‌ కేసు: మరో కీలక నిందితుడు అరెస్ట్‌

విధాత‌: డ్రగ్స్‌ కేసులో మరో కీలక నిందితుడు అరెస్టు అయ్యాడు. ఎడ్విన్‌తో కలిసి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న బాలమురుగన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అరెస్టైన ఎడ్విన్‌ ఇచ్చిన సమాచారంతో ప్రత్యేక బృందాలు గాలించాయి. గోవాలో ఉంటున్న బాలమురుగన్‌ను అరెస్టు చేసి పోలీసులు నగరానికి తీసుకొచ్చారు. జస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు ఏర్పాటు చేశాడు. గదులు అద్దెకు ఇవ్వడం, మాదకద్రవ్యాలు సరఫరా చేయ‌డం.. పరస్పరం సాయం చేసుకుంటూ డ్రగ్స్‌ సరఫరాలో […]

డ్రగ్స్‌ కేసు: మరో కీలక నిందితుడు అరెస్ట్‌

విధాత‌: డ్రగ్స్‌ కేసులో మరో కీలక నిందితుడు అరెస్టు అయ్యాడు. ఎడ్విన్‌తో కలిసి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న బాలమురుగన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అరెస్టైన ఎడ్విన్‌ ఇచ్చిన సమాచారంతో ప్రత్యేక బృందాలు గాలించాయి. గోవాలో ఉంటున్న బాలమురుగన్‌ను అరెస్టు చేసి పోలీసులు నగరానికి తీసుకొచ్చారు.

జస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు ఏర్పాటు చేశాడు. గదులు అద్దెకు ఇవ్వడం, మాదకద్రవ్యాలు సరఫరా చేయ‌డం.. పరస్పరం సాయం చేసుకుంటూ డ్రగ్స్‌ సరఫరాలో ఎడ్విన్‌, బాలమురుగన్‌ కీలకంగా మారారు.

బాలమురుగన్‌ జాబితాలో 2 వేల మంది వినియోగదారులున్నారు. ఆ జాబితాలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. ఆయనను గోవా నుంచి పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. దీనిపై లోతుగా అధ్యయనం చేయడానికి పోలీసులు సోమవారం కస్టడీ పిటిషన్‌ వేయనున్నారు.