Viral Video | ఈ భూమ్మీద అతి భయంకరమైనవి పాములు. పాములు కాటేస్తే క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతాం. అలాంటి భయంకరమైన పాములకు దూరంగా ఉంటాం. కేవలం నైపుణ్యం కలిగిన స్నేక్ క్యాచర్స్ మాత్రమే పాములను పడుతుంటారు. ఓ ఇంట్లో సీలింగ్‌లో దాచుకున్న ఓ రెండు పాములను ఓ యువతి అవలీలగా పట్టేసింది. ఏ మాత్రం బెదరలేదు.. వణకలేదు ఆమె.
ఆస్ట్రేలియాలోని ఓ ఇంట్లో ఐదారడుగు పొడవు ఉన్న ఓ రెండు సీలింగ్‌లో దాచుకున్నట్లు ఇంటి యజమానులు పసిగట్టారు. దీంతో ఓ యువతి బెదరకుండా.. సీలింగ్‌కు రంధ్రం చేసింది. స్టూల్ ఎక్కి.. పాములను బయటకు వచ్చేలా చేసింది. క్షణాల్లోనే అవలీలగా రెండు పాములను పట్టుకుంది.అందులో ఓ పాము ఆమె చేతిని చుట్టేసుకుంది. ఇంకో పామును కూడా పట్టి, దాని మూతిని గట్టిగా అదిమి పట్టింది. అనంతరం రెండు పాములతో కిందకు దిగింది.
ఒకేసారి రెండు పాములను పట్టేసిన ఆమె నైపుణ్యం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను 5 మిలియన్ల మంది వీక్షించగా, 69 వేల మంది లైక్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.