మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్..!
మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ఇవ్వనున్నట్టు ఊహాగానాలు చెలరేగాయి.

కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే వెంటనే అంత స్ట్రైక్ కాకపోవచ్చు కాని, చిరంజీవి అంటే మాత్రం ప్రపంచం మొత్తం ఆయనని ఇట్టే గుర్తు పట్టేస్తారు. పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో కొణిదెల వెంకట్రావు-అంజనాదేవిలకు మొదటి సంతానంగా జన్మించిన చిరు తన స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. చిరంజీవికి దేశ విదేశాలలో కూడా అశేషమైన అభిమాన గణం ఉంది. కెరీర్ ఆరంభంలో విలన్ పాత్రలు పోషించినా ఆ తరువాత హీరోగా తిరుగులేని స్థానాన్ని సొంతం చేసుకున్నారు. చిరంజీవి సినిమాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు.
చిరంజీవి చేసిన సేవలకి గాను ఆయనకి అనేక అవార్డులు, రివార్డులు వరించాయి. భారత ప్రభుత్వం 2006లో మూడవ అతిపెద్ద పౌర పురస్కారం అయిన పద్మ భూషణ్ తో చిరంజీవిని సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా చిరంజీవి పద్మభూషణ్ అవార్డు అందుకున్నా విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ బజ్ ప్రకారం ఈనెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఆయనని పౌర పురస్కారాల్లో భాగంగా పద్మ విభూషణ్‌తో మన ప్రభుత్వం సత్కరించే అవకాశం ఉన్నట్లు వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సంవత్సరం పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పేరున్నట్లు డిల్లీ నుంచి ఓ వార్త లీక్ అయిందని అంటున్నారు.
సినీ పరిశ్రమకి చేసిన సేవలతో పాటు కొవిడ్ మహమ్మారి సమయంలో చేసిన సామాజిక సేవకి గాను చిరంజీవికి పద్మ విభూషణ పురస్కారం ఇవ్వాలని భారత ప్రభుత్వం భావిస్తుందట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ అయితే రానుంది. ఇక చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ 2025 సంక్రాంతి కి రిలీజ్ కానుంది. రీసెంట్‌గా మూవీకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు భారీగా పెంచారు.